తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మీరు చూడకపోతే టిక్కెట్లు అమ్మండి.. ప్లీజ్​' - resell

ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు టిక్కెట్లు కొనుక్కున్న భారత అభిమానులు తమ టిక్కెట్లను విక్రయించాలని కోరాడు కివీస్ ఆటగాడు జిమ్మీ నీషమ్. నిజమైన ఫ్యాన్స్​కు అవకాశమివ్వాలని సూచించాడు.

నీషమ్

By

Published : Jul 13, 2019, 3:47 PM IST

న్యూజిలాండ్ ఆల్​రౌండర్ జిమ్మీ నీషమ్​ భారత్ అభిమానల ముందు ఓ విన్నపం ఉంచాడు. ఫైనల్​ మ్యాచ్​కు టిక్కెట్లను కొనుక్కున్న టీమిండియా ఫ్యాన్స్​ వాటిని తిరిగి విక్రయించాలని కోరాడు. మ్యాచ్ చూడకూడదని అనుకునే వారు అధికారిక వెబ్​సైట్​లో అమ్మాలని తన ట్విట్టర్లో సూచించాడు.

"ప్రియమైన భారత్​ క్రికెట్ అభిమానులారా.. ఒకవేళ మీరు ఫైనల్​ మ్యాచ్​ చూడదల్చుకోకపోతే దయచేసి వాటిని తిరిగి అధికారిక వెబ్​సైట్​లో విక్రయించండి. ఎక్కువ లాభానికి మీరు అమ్ముకునే వీలుంది. కానీ నిజమైన క్రికెట్ అభిమానులకు అవకాశం కల్పించండి" -జిమ్మీ నీషమ్, న్యూజిలాండ్ ఆటగాడు.

ప్రపంచకప్​ సెమీస్​లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టిన భారత్​ అభిమానుల ప్రపంచకప్​ కలను కలగానే మిగిల్చింది కోహ్లీసేన. టీమిండియా తప్పకుండా ఫైనల్ చేరుతుందని చాలామంది ఫ్యాన్స్ మ్యాచ్​ ప్రత్యక్షంగా చూసేందుకు ముందుగానే టిక్కెట్లు కొనుక్కున్నారు.

ఇటీవలే ఐసీసీ తిరిగే డబ్బు ఇచ్చే విధానాన్ని(రిటర్న్​ పాలసీ) తీసుకొచ్చింది. టిక్కెట్లను ఇచ్చి తమ డబ్బు తిరిగి తీసుకోవచ్చు.

లార్డ్స్​ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య ఫైనల్​ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఇది చదవండి: 'సోదరా... నీకు నేనున్నా.. నా మద్దతు నీకే'

ABOUT THE AUTHOR

...view details