తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లా తరఫున ఫిజ్​ 5 వికెట్ల రికార్డు

ఈ ప్రపంచకప్​లో బంగ్లా తరఫున ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు బంగ్లాదేశ్‌ పేస్​ బౌలర్​ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌. మంగళవారం భారత్​తో జరిగిన మ్యాచ్​లో  ముస్తాఫిజుర్‌ ఈ ఘనత సాధించాడు.

ముస్తాఫిజుర్​ ఖాతాలో 5 వికెట్ల రికార్డు

By

Published : Jul 3, 2019, 9:55 AM IST

ప్రపంచకప్​లో బంగ్లాదేశ్​ బౌలర్​ ముస్తాఫిజుర్​ సత్తా చాటుతున్నాడు. బర్మింగ్​హామ్​ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్లు తీశాడు. ఈ మెగాటోర్నీలో అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో షకిబ్​ ఐదు వికెట్లు సాధించగా, తాజాగా ముస్తాఫిజుర్‌ ఈ ఘనత సాధించాడు.

2011 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్​పై బరిలోకి దిగిన బంగ్లా ఆటగాడు షఫియిల్‌ ఇస్లామ్‌ నాలుగు వికెట్లు సాధించాడు. ఇదే ఈ వరల్డ్‌కప్‌ ముందు వరకు బంగ్లా తరఫున ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. దాన్ని షకిబ్​, ముస్తాఫిజుర్‌లు బ్రేక్‌ చేశారు. భారత్‌పై మ్యాచ్‌లో ముస్తాఫిజుర్‌ పది ఓవర్లు బౌలింగ్‌ చేసి 5 వికెట్లు తీసి 59 పరుగులు ఇచ్చాడు.

భారత్​పై మరోసారి...

నాలుగేళ్ల కిందట బంగ్లా చేతిలో వన్డే సిరీస్‌ ఓడిపోయింది భారత జట్టు. అదే ముస్తాఫిజుర్‌కు అరంగేట్రం. అప్పుడు భారత్‌ ఓడిన రెండు మ్యాచ్‌ల్లో ముస్తాఫిజుర్‌ గణాంకాలు.. 5/40, 6/43. ఇప్పుడతను మరోసారి భారత్‌పై 5 వికెట్లతో తన ప్రతాపాన్ని చూపించాడు. ఒకే ఓవర్లో కోహ్లీ, పాండ్యల వికెట్లు తీసి భారత్‌ పరుగుల వేగానికి కళ్లెం వేశాడు. చివరి రెండు ఓవర్లలో ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌ అమోఘం. 48వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చి కార్తీక్‌ వికెట్‌ తీసిన అతను.. 50వ ఓవర్లో ధోని, షమిలను ఔట్‌ చేసి 3 పరుగులే ఇచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details