ప్రపంచకప్‌లో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే శిఖర్‌ధావన్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భువనేశ్వర్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా ఈ జాబితాలో విజయ్ శంకర్ చేరాడు. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా వేసిన యార్కర్ కాలికి తగిలి విలవిల్లాడాడు విజయ్.
గురువారం జరిగిన ప్రాక్టీస్‌కు విజయ్ హాజరు కాలేదు. అయితే ఈ గాయం కారణంగా ఈ శనివారం జరగాల్సిన ఆఫ్గాన్‌తో మ్యాచ్‌కు ఆడతాడా.. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మెగాటోర్నీ లీగ్ దశ పూర్తి కాకుండానే భారత ఆటగాళ్లు గాయలపాలవడం అభిమానులను కలవరపరుస్తోంది.