కర్ణాటక జట్టుకు అతడు ఓపెనర్. లిస్ట్ ఏ (దేశవాళీ వన్డే) క్రికెట్‌లో 75 మ్యాచ్‌లు ఆడాడు. 48.71 సగటుతో 3,605 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 2011లో అరంగేట్రం చేశాడు. 77 మ్యాచ్‌లు ఆడి 18.34 సగటుతో 1,266 పరుగులు చేశాడు. ఇవీ ప్రపంచకప్ భారత జట్టులో తాజాగా చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ గణాంకాలు.
గాయం కారణంగా వైదొలిగిన విజయ్ శంకర్ స్థానంలో మయాంక్‌కు అవకాశం వచ్చింది. మెగాటోర్నీలో విజయ్ మూడు మ్యాచ్‌లు ఆడి 58 పరుగులు చేసి రెండు వికెట్లు తీశాడు. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడిని తప్పించి పంత్‌కు అవకాశ కల్పించింది యాజమాన్యం.
ప్రస్తుతం చర్చంతా మయాంక్ అగర్వాల్ ఎంపిక గురించే. అంబటి రాయుడుకు అవకాశం ఇవ్వకుండా మయాంక్‌కు చోటు లభించడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది.
రాయుడు సరిపోడా..?
పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో నాలుగో స్థానానికి రాయుడు సరైనవాడని కోహ్లీ నుంచి ప్రశంసలు పొందినా ఫలితం లేదు. న్యూజిలాండ్ గడ్డపై భారత టాప్ స్కోరర్‌గా నిలిచినా సెలెక్టర్ల దృష్టికి రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత జట్టుకు నాలుగో స్థానంలో నమ్మదగ్గ బ్యాట్స్‌మన్ అవసరం. మిడిలార్డర్లో మంచి ఇన్నింగ్స్ ఆడగల సమర్థుడు రాయుడు. భారీ భాగస్వామ్యాలూ నెలకొల్పగలడు. మరి రాయుడును కాదని మయాంక్‌కు అవకాశం కల్పించడమే ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది.