తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీని ద్వేషించే వారు వేరే గ్రహానికి వెళ్లిపొండి' - dhoni

బంగ్లాతో జరిగిన వార్మప్​ మ్యాచ్​లో మహీ ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ప్రాక్టీస్ మ్యాచ్​ను పర్​ఫెక్ట్​ మ్యాచ్​గా మార్చగలడు" అంటూ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

మహేంద్ర సింగ్ ధోనీ

By

Published : May 29, 2019, 3:19 PM IST

ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేసినా ట్రెండ్ అవుతోంది. తాజాగా బంగ్లాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​లో శతకంతో విజృంభించిన మహీని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. "కొన్ని ఎప్పటికీ మారవు" అంటూ ధోనీని ట్యాగ్​ చేస్తూ విభిన్నంగా పోస్ట్​ చేస్తున్నారు.

"ప్రాక్టీస్ మ్యాచ్​ను పర్​ఫెక్ట్​ మ్యాచ్​గా ధోనీ మాత్రమే మార్చగలడు" అని ఒకరు స్పందించగా... "ఎన్నేళ్లు గడిచినా, ధోనీ ప్రదర్శన మారదు" అంటూ మరొకరు ట్వీట్ చేశారు. "మహీని ద్వేషించే వారుంటే వేరే గ్రహానికి వెళ్లిపొండి" అంటూ ఇంకొకరు పోస్ట్​ చేశారు.

వేల్స్​లోని​ కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 95 పరుగుల తేడాతో గెలిచింది. ధోనీ(113), రాహుల్(108) శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 264 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచకప్​లో తన మొదటి మ్యాచ్​ను జూన్ 5న సౌతాఫ్రికాతో తలపడనుంది భారత్.

ఇది చదవండి: WC19: మీ క్రికెట్​ విన్యాసాలకు నయా ఛాలెంజ్​!

ABOUT THE AUTHOR

...view details