నాటింగ్‌హామ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారనుంది. సోమవారం నుంచి విస్తారంగా వర్షం కురుస్తోంది. టీమిండియా నెట్ ప్రాక్టీస్‌కు కూడా పిచ్ అనుకూలించలేదు. మైదానమంతా చిత్తడిగా మారుతోంది. వాన కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు.పూర్తిగా రద్దయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
WC19: భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు! - india
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌ను వరుణుడు దెబ్బతీసేలా ఉన్నాడు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వాన వల్ల మైదానం చిత్తడిగా మారుతోంది. కోహ్లీసేన నెట్ ప్రాక్టీస్‌కు కూడా పిచ్ అనుకూలించలేదు.
వర్షం
ఇప్పటికే వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగనట్లయితే ఈ నెల 16న జరగాల్సిన పాకిస్థాన్‌తో మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. రెండు మ్యాచుల్లో నెగ్గిన భారత్ నాలుగు పాయింట్లు సాధించి నాలుగోస్థానంలో ఉంది.
మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన కివీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే ఏడు పాయింట్లతో న్యూజిలాండ్‌కు సెమీస్ అవకాశాలు మెరుగౌతాయి.