ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేస్ బౌలర్‌గా, ఆల్‌రౌండర్‌గా రాణిస్తోన్న మార్కస్ స్టాయినిస్ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భారత్‌తో జరిగిన పోరులో గాయపడిన స్టాయినిస్... పక్కటెముకల్లో నొప్పి కారణంగా పాకిస్థాన్‌తో ఆ బరిలోకి దిగలేదు. ముందు జాగ్రత్తగా అతడి స్థానంలో బ్యాకప్‌గా మరో ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్‌ను ఇంగ్లాండ్ రప్పిస్తున్నారు. వచ్చే వారం జట్టుతో కలవనున్నాడు మార్ష్. ఈ విషయాన్ని ఆసీస్ జట్టు సారథి ఫించ్ వెల్లడించాడు.
ఆసీస్ ఆల్‌రౌండర్ స్టాయినిస్ స్థానంలో మార్ష్ - cricket worldcup 2019
ఆసీస్ ఆటగాడు మిషెల్ మార్ష్ ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకోలేని మార్ష్ తాజాగా తుది జట్టులో బరిలో దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నందున మార్ష్‌తో ఆ స్థానం భర్తీ చేస్తున్నారు ఆసీస్ సెలక్టర్లు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టాయినిస్ స్థానంలో మార్ష్
"స్టాయినిస్ త్వరగా కోలుకుంటే మిగతా మ్యాచ్‌లకు ఆడే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగానే మిషెల్ మార్ష్‌ను రప్పిస్తున్నాం. మార్ష్‌ను అప్పుడే జట్టులోకి తీసుకోము. వైద్యుల నివేదిక అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం"
--ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా జట్టు సారథి
గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని ఎంచుకునే అవకాశం అన్ని జట్లకూ కల్పించింది ఐసీసీ.