తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మహీ... రిటైర్మెంట్ ఆలోచన రానీయొద్దు' - latha mangeshakr

క్రికెట్​కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రముఖ గాయని లతా మంగేష్కర్ స్పందించారు. ధోనీ మరి కొంత కాలం క్రికెట్ ఆడాలని ఆకాంక్షించారు.

ధోనీ

By

Published : Jul 12, 2019, 5:27 AM IST

Updated : Jul 12, 2019, 9:19 AM IST

టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ ధోనీ రిటైర్మెంట్​పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహీ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతాడనే వార్తలపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

అయితే ధోనీ మరి కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లూ మహీ రిటైర్మెంట్​పై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ప్రముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్‌ ఈ విషయంపై స్పందించారు. భార‌తర‌త్న అవార్డు గ్ర‌హీత ల‌తా జీ.. ధోనీ రిటైర్‌మెంట్ వార్త‌ల‌పై ట్విట్టర్ వేదికగా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. "ధోనీ గారూ! న‌మ‌స్కారం.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతార‌నే వార్త‌ల‌ను కొన్ని రోజుల నుంచి వింటున్నా. మీరు మ‌రి కొన్నాళ్ల పాటు దేశం తరఫున క్రికెట్ ఆడాల్సిన అవ‌స‌రం ఉంది. రిటైర్ కావాల‌నే ఆలోచ‌న కూడా మీ మ‌న‌స్సులో రావ‌ద్ద‌ని ఆశిస్తున్నా. మ‌రి కొంత‌కాలం క్రికెట్ ఆడాల‌ని కోరుకునే అభిమానుల్లో నేనూ ఒకరిని" అంటూ ట్వీట్ చేసింది.

లతా మంగేష్కర్ ట్వీట్

ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 239 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యఛేదనలో భార‌త జ‌ట్టు..ఆరంభం నుంచే వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. మిడిలార్డ‌ర్‌లో ధోనీ, ర‌వీంద్ర జ‌డేజా కొద్దిసేపు జాగ్రత్తగా ఆడారు. వీరు క్రీజులో ఉన్నంతసేపు గెలుపుపై ఆశలుండేవి. ఇద్దరూ ఔటైన వెంటనే టీమిండియా ఓటమి ఖరారైంది.

ఇవీ చూడండి.. టీమిండియాకు బై చెప్పేసిన ఫర్హాట్..

Last Updated : Jul 12, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details