టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇతర క్రికెటర్లకి ఆటలో చాలా తేడా ఉందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం లారా అభిప్రాయపడ్డాడు. నిరంతరం పనిచేసే తత్వం, ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలో సత్తా చాటగలగటమే విరాట్‌ని అందరికంటే భిన్నంగా నిలబెట్టిందన్నాడు.
కోహ్లీ ఆట తీరే అతడిని టీమిండియా కెప్టెన్ స్థాయికి తీసుకెళ్లిందని లారా తెలిపాడు. డీవై పాటిల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాక తన భావాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్లో తన తొలి రోజులని, సచిన్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
"విరాట్ ఎంత మంచి ఆటగాడైనా.. నా దృష్టిలో ఎప్పటికీ సచినే బెస్ట్. ప్రస్తుతం మిగిలిన ఆటగాళ్లకి కోహ్లీకి చాలా తేడా ఉంది. రోహిత్ శర్మ వరల్డ్ కప్‌లో నాలుగు సెంచరీలు చేసినప్పటికీ... టీట్వంటీ, టీ10, టెస్ట్ క్రికెట్.. పిచ్ ఏదైనా విరాట్ భిన్నంగా రాణిస్తాడు".
- లారా, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం