తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: నిలకడగా ఆడుతున్న భారత బ్యాట్స్​మెన్ - southafrica

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో భారత్​ బ్యాట్స్​మెన్ నిలకడగా ఆడుతున్నారు. చేసింది. ఓపెనర్​ ధావన్​​ 8 పరుగులకే వెనుదిరగగా.. కోహ్లీ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

రోహిత్​

By

Published : Jun 5, 2019, 8:56 PM IST

Updated : Jun 5, 2019, 11:31 PM IST

228 పరుగుల లక్ష్య చేధనలో బరిలో దిగిన భారత్​కు శుభారంభం దక్కలేదు. 8 పరుగులు చేసిన ధావన్​... రబాడా బౌలింగ్​లో ఔటయ్యాడు. అప్పటికి భారత్​ 6 ఓవర్లకు 13 పరుగులే చేసింది.

మరోవైపు రోహిత్​ శర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్​ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. రోహిత్ అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నాడు.

ధావన్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన టీమ్​ఇండియా సారథి కోహ్లీ తడబడ్డాడు. 34 బంతుల్లో 18 పరుగులు చేసి ఫెలుక్వాయో బౌలింగ్​లో ఔటయ్యాడు. 33 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు భారత సారథి.

ప్రోటీస్​ బౌలర్లు రబాడా, ఫెలుక్వాయో చెరొక వికెట్​ పడగొట్టారు.

అంతకు ముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణిత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.

Last Updated : Jun 5, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details