ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఈ మోగాటోర్నీలో ఇప్పటివరకు రెండు అర్ధసెంచరీలు సాధించిన కోహ్లీ... నేడు మరొకటి ఖాతాలో వేసుకున్నాడు.
కింగ్ హ్యాట్రిక్...

వరుస మ్యాచ్‌ల్లో మూడు సార్లు 50కి పైగా పరుగులు చేసిన రెండో భారతీయ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు కింగ్ కోహ్లీ. 1992లో టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్ వరుసగా 3 అర్ధశతకాలు సాధించాడు.
సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ మైదానంలో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో విరాట్ 63 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్‌లో విరాట్‌కిది 52వ అర్ధశతకం.
ప్చ్... మిస్సయ్యాడు..
కెరీర్‌లో 20వేల పరుగుల మార్కును ఈ మ్యాచ్‌లో అందుకోలేకపోయాడు కోహ్లీ. ఈ మ్యాచ్ ముందు వరకు విరాట్ ఖాతాలో 19వేల 896 పరుగులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 104 పరుగులు చేస్తే 20వేల మార్కును అందుకునేవాడు. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 67 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ. అఫ్గాన్‌తో మ్యాచ్‌లోనే ఈ రికార్డు అందుకుంటాడని అభిమానులు ఆశించారు.