తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పుడు సహచరులు... ఇప్పుడు ప్రత్యర్థులు - ఇంగ్లాండ్X న్యూజిలాండ్

ప్రస్తుతం ప్రపంచకప్ ఫైనల్లో తలపడుతున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల సారథులు ఇంతకు ముందు ఒకే జట్టులో కలిసి ఆడారు. 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

kane williamson vs eoin morgan

By

Published : Jul 14, 2019, 3:06 PM IST

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల సారథులు కేన్ విలియమ్సన్​, ఇయాన్ మోర్గాన్ ప్రస్తుతం ప్రపంచకప్​ ఫైనల్​లో ప్రత్యర్థులు. కానీ.. వీరిద్దరూ ఒకే జట్టులో ఆడిన సంగతి మీకు తెలుసా..?

ఐపీఎల్​లో​ సన్​రైజర్స్ హైదరాబాద్​ తరఫున ఈ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించారు. 2016లో సన్​రైజర్స్​ టైటిల్ గెలవగా.. ఆ జట్టులో వీరిద్దరు ఒకే జట్టులో సభ్యులు.2016లో హైదరాబాద్​ జట్టును విజేతగా నిలిపి ఆనందాన్ని పంచుకున్న సహచరులు. ఇప్పుడు ప్రత్యర్థులుగా ప్రపంచకప్​ తుదిపోరులో తలపడుతున్నారు.

మూడేళ్ల క్రితం విలియమ్సన్ - మోర్గాన్ ఐపీఎల్ కప్పుతో దిగిన ఫొటోను సన్​రైజర్స్​ ఫ్రాంచైజీ ప్రపంచకప్​ ఫైనల్​ సందర్భంగా ట్విట్టర్లో పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details