తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేన్​ విలియమ్సన్​ ఖాతాలో 6వేల పరుగులు - newzeland captain kane williamson reach 6k runs in odi

లార్డ్స్​ వేదికగా శనివారం ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​​ సారథి కేన్​ విలియమ్సన్​ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వన్డే కెరీర్​లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.  ఈ ఘనతను వేగంగా సాధించిన మూడో బ్యాట్స్​మెన్​గా రికార్డు సృష్టించాడు.

కేన్​ విలియమ్సన్​ ఖాతాలో 6వేల పరుగులు

By

Published : Jun 30, 2019, 1:31 PM IST

వన్డే కెరీర్​లో 6వేల పరుగులు సాధించాడు కివీస్​ సారథి, బ్యాట్స్​మెన్​ కేన్​ విలియమ్సన్​. ప్రపంచకప్​లో భాగంగా శనివారం ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో 51 బంతుల్లో 40 రన్స్​ చేసి ఈ ఘనత అందుకున్నాడు. ఈ ఫీట్​ చేరుకోడానికి 139 ఇన్నింగ్స్​ తీసుకున్నాడు​ విలియమ్సన్​​. అంతేకాకుండా ఈ రికార్డును వేగంగా అందుకున్న మూడో బ్యాట్స్​మెన్​గానూ చరిత్ర సృష్టించాడు.

దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్​ ఆమ్లా 123 ఇన్నింగ్స్​లలో, టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ 136 ఇన్నింగ్స్​లలో ఈ రికార్డు సొంతం చేసుకొని తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

కేన్​ సారథ్యంలోని కివీస్​ జట్టు... వన్డే ప్రపంచకప్​లో 8 మ్యాచ్​లు ఆడి 5 విజయాలు, రెండు ఓటములు ఖాతాలో వేసుకుంది. ఒక మ్యాచ్​ రద్దయింది. ఫలితంగా 11 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. చెస్టర్​ లీ స్ట్రీట్​ మైదానంలో జులై 3న తన చివరి లీగ్​ మ్యాచ్​లో భాగంగా ఇంగ్లాండ్​తో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details