తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన - select

ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్​ పర్యటనకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్​గా నియమించింది. టీ 20 జట్టులో కుర్రాళ్లకు అవకాశం కల్పించింది.

భారత్

By

Published : Jul 21, 2019, 2:38 PM IST

Updated : Jul 21, 2019, 3:09 PM IST

వెస్టిండీస్​ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఎమ్​ఎస్​కే ప్రసాద్ నేతృత్వంలో కమిటీ నేడు ముంబయిలో సమావేశమైంది. మూడు ఫార్మాట్లకు సారథిగా విరాట్ కోహ్లీనే ఉంచింది. టెస్టులు మినహా టీ -20, వన్డే జట్టులో బుమ్రాకు విశ్రాంతి నిచ్చారు.

వన్డే జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ.

టీ 20 జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్ (కీపర్), కృనాల్ పాండ్య, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ

టెస్టు జట్టు

విరాట్ కోహ్లీ( కెప్టెన్), రహానే, మయాంక్ అగర్వాల్, కే ఎల్ రాహుల్, పుజారా, హనుమా విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ (కీపర్), సాహా (కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.

ఈ పర్యటనకు ధోని దూరంగా ఉన్న నేపథ్యంలో రిషభ్ పంత్​ కీపర్​ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వృద్ధిమాన్ సాహా జట్టులోకి రావడం మినహా టెస్టు టీమ్​లో పెద్దగా మార్పులేమి చేయలేదు. మయాంక్ అగర్వాల్ మూడో ఓపెనర్​గా రానున్నాడు. పంత్, సాహాలో తుది జట్టులో ఎవరొకరిని తీసుకునే అవకాశముంది.

వన్డేల్లో జాదవ్​కు మళ్లీ అవకాశం కల్పించింది సెలక్షన్ కమిటీ. ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ బౌలర్లను తీసుకుంది. బ్యాటింగ్ శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలను తీసుకుంది .

టీ 20ల్లో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశం కల్పించింది. కృనాల్ పాండ్య, చాహర్ సోదరులు, వాషింగ్టన్ సుందర్​ను ఎంపిక చేసింది.

ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 5వరకు వెస్టిండీస్​లో పర్యటించనుంది భారత్​. రెండు మ్యాచ్​లకు అమెరికాలోని ఫ్లోరిడా వేదిక కానుంది. మూడు టీ 20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా.

ఇది చదవండి: ట్విట్టర్లో భారత బాక్సర్ల మాటల పంచ్​లు..!

Last Updated : Jul 21, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details