తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ కెప్టెన్​ను వెనుకేసుకొచ్చిన భారతీయులు - indian netigens support to pak cricketer

పాకిస్థాన్​ కెప్టెన్​ సర్ఫరాజ్​ఖాన్​ వస్త్రధారణ పట్ల ఆ దేశ రచయిత విమర్శలు గుప్పిస్తే... భారత అభిమానులు మాత్రం తమ సహృదయాన్ని చాటుకున్నారు. ఖాన్​కు నెట్టింట మద్దతుగా నిలుస్తూ మరోసారి భారత్​ ఔరా అనిపించారు.

పాక్​ కెప్టెన్​ను వెనుకేసుకొచ్చిన భారతీయులు

By

Published : May 31, 2019, 3:16 PM IST

ప్రపంచకప్​ 2019 ఆరంభానికి ముందు 10 జట్ల కెప్టెన్​లు బకింగ్​ హామ్​ ప్యాలెస్​లో ఎలిజబెత్​ రాణిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి సారథులంతా ఫార్మల్​ డ్రెస్సుల్లో రాగా పాకిస్థాన్​ కెప్టెన్​ సర్ఫరాజ్​ సంప్రదాయ దుస్తుల్లో వెళ్లారు. అయితే ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు పాక్​కు చెందిన ఓ​ రచయిత.

పాక్​ రచయిత ట్వీట్​

" అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్‌ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాకిస్థానీ సారథి మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్‌, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే! ".
-- పాక్​ రచయిత, ట్వీట్​

పాక్​ సారథిపై రచయిత అవమానకర కామెంట్లు చేసినా... భారత అభిమానులు సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

సర్ఫరాజ్​కు మద్దతుగా భారతీయ అభిమానుల ట్వీట్లు
అభిమానుల ట్వీట్లు

'సర్ఫరాజ్‌ను విమర్శించడంలో అర్థంలేదు. నిజానికి కోహ్లి కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సింది. అయినా ఆటగాడి ప్రతిభను చూడాలి కాని అతడి వస్త్రధారణను కాదు. ఎలిజబెత్​ రాణీగారు భారత్‌ వచ్చినపుడు చీర కట్టుకుంటారా. ప్రధాని మోదీని కలిసినపుడు విదేశీ నేతలు మనలా తయారవుతారా? బ్రిటన్‌ రాజును కలిసినపుడు గాంధీజీ ధోతి కట్టుకున్న విషయం మరచిపోయారా? అనవసరంగా అతడి మీద పడి ఏడవకండి'’ అంటూ భారత అభిమానులు ట్వీట్లు చేస్తూ పాక్‌ సారథికి అండగా నిలుస్తున్నారు.

రచయిత కామెంటుకు స్పందనలు

ABOUT THE AUTHOR

...view details