తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత జట్టే ప్రపంచకప్​​ విజేత : షోయబ్​​ అక్తర్​ - shoaib akthar

వన్డే ప్ర‌పంచ‌క‌ప్​ 2019 విజేతగా టీమిండియా నిలుస్తుందని పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ జోస్యం చెప్పాడు. కోహ్లీసేన మంచి ఫామ్​లో ఉందని ప్రశంసలు కురిపించాడు. ఆదివారం తన సొంత యూట్యూబ్​ ఛానెల్​లో ఈ విషయంపై అభిప్రాయాన్ని వెల్లడించాడు.

భారత జట్టే ప్రపంచకప్​​ విజేత : షోయబ్​​ అక్తర్​

By

Published : Jul 8, 2019, 9:33 AM IST

ప్రపంచకప్​ టైటిల్‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు ఎగ‌రేసుకెళ్తుంద‌ని పాకిస్థాన్​ మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌, రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయ‌బ్ అక్తర్​ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈసారి కోహ్లీసేన కప్​ను సాధిస్తుందని వ్యాఖ్యానించాడు. ఆదివారం త‌న సొంత యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఈ అంశంపై మాట్లాడాడీ మాజీ పేసర్.

" మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్​ వేదికగా మంగ‌ళ‌వారం జ‌రగనున్న మ్యాచ్​లో కివీస్​ను మట్టికరిపించి టీమిండియా కచ్చితంగా ఫైనల్​ చేరుతుంది. న్యూజిలాండ్ క్రికెట‌ర్లు ఒత్తిడిని త‌ట్టుకోలేర‌ు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ ప్ర‌త్య‌ర్థి కంటే మెరుగ్గా ఉన్న కోహ్లీసేనకు తిరుగులేద‌ు. ప్ర‌పంచ‌క‌ప్ ఆసియా ఖండాన్ని దాటి బ‌య‌టి దేశాల‌కు వెళ్లకూడ‌ద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. జులై 14న లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో భార‌త క్రికెట్ జ‌ట్టు విజేతగా అవతరిస్తుంది"
-- షోయబ్​ అక్తర్​, పాక్​ మాజీ క్రికెటర్​

రన్​రేట్​ వల్లే...

టాప్​ 5లో నిలిచిన పాక్​ జట్టు ప్రదర్శనను మెచ్చుకున్నాడు షోయబ్​ అక్తర్​. కివీస్​ కన్నా పాకిస్థాన్​ అద్భుతంగా ఆడింద‌ని కితాబిచ్చాడు. రన్​రేట్​ లెక్కింపు పద్ధతి సరిగా లేకపోవడం వల్లే పాక్​ ఇంటిబాట పట్టిందని.. అందుకే ఈ విధానంలో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details