తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​పై టీమిండియా ఘనవిజయం - PAKISTHAN CRICKET TEAM

మరికాసేపట్లో చిరకాల ప్రత్యర్థుల పోరు

By

Published : Jun 16, 2019, 1:58 PM IST

Updated : Jun 16, 2019, 11:59 PM IST

2019-06-16 23:51:36

వరుణుడు దోబూచూలాటలో పాకిస్థాన్​పై భారత్​దే పైచేయి

ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా జరిగిన పాక్-భారత్ ప్రపంచకప్​ మ్యాచ్​లో కోహ్లీసేన ఘనవిజయం సాధించింది. డక్​వర్త లూయిస్ ప్రకారం అయిన ఈ మ్యాచ్​లో 89 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.

2019-06-16 23:32:29

భారత్- పాక్ మ్యాచ్​లో డక్ వర్త్​ లూయిస్

ఎంతో ఉత్కంఠగా సాగాల్సిన భారత్-పాక్ ప్రపంచకప్​ మ్యాచ్​ వర్షం వల్ల ఇబ్బందులతో జరుగుతోంది. ప్రస్తుతం 35 ఓవర్లలో 166 పరుగులు చేసింది పాకిస్థాన్. మ్యాచ్​ను 40 ఓవర్లకు కుదించారు అంపైర్లు. కాసేపట్లో తిరిగి ఆట ప్రారంభం కానుంది.

2019-06-16 22:58:35

మ్యాచ్​ ప్రారంభమైతే సరే..లేదంటే

మ్యాచ్​కు వరుణుడు ఆటంకంగా మారాడు. ఒకవేళ మ్యాచ్​  తిరిగి ప్రారంభం కాకపోతే టీమిండియా గెలుపు లాంఛనమే. ఎందుకంటే డక్​వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 35 ఓవర్లకు 252 పరుగులు చేయాల్సి ఉంది పాకిస్థాన్. కానీ ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులే చేసింది.

2019-06-16 22:44:08

మళ్లీ వచ్చిన వరుణుడు.. ఆగిన పాకిస్థాన్-భారత్ మ్యాచ్​

వర్షం మరోసారి భారత్- పాక్ ప్రపంచకప్​ మ్యాచ్​కు అడ్డంకిగా నిలిచింది. 35 ఓవర్లలో  ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది పాకిస్థాన్. ఈ దశలో వరుణుడి రాకతో ఆటకు అంతరాయం కలిగింది. క్రీజులో షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీమ్ ఉన్నారు. విజయానికి మరో 90 బంతుల్లో 171 పరుగులు అవసరం.

భారత బౌలర్లలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్​దీప్ తలో రెండు వికెట్లు తీశారు.

2019-06-16 22:36:17

ఔటైన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆచితూచి ఆడుతున్న పాకిస్థాన్.. ఆరో వికెట్ కోల్పోయింది. 30 బంతుల్లో 12 పరుగులు చేసిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ విజయ్ శంకర్ బౌలింగ్​లో బౌల్డ్ అయ్యాడు.

2019-06-16 22:03:21

మెరిసిన హార్దిక్ పాండ్య.. వరుసగా రెండు వికెట్లు

ఆచితూచి ఇన్నింగ్స్​ ఆడుతున్న పాకిస్థాన్ వరుసగా వికట్లు కోల్పోయింది. ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు షోయాబ్ మాలిక్. అంతకు ముందు 9 పరుగులు చేసిన హఫీజ్​ను వరుస బంతుల్లో హార్దిక్ పాండ్య ఔట్ చేశాడు. ప్రస్తుతం 28 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది పాకిస్థాన్. క్రీజులో కెప్టెన్ సర్ఫరాజ్, ఇమాద్ వసీమ్ ఉన్నారు.

2019-06-16 21:55:59

ఫామ్​లో ఉన్న ఫకర్​ ఔటయ్యాడు

నెమ్మదిగా ఆడుతున్న పాకిస్థాన్ ధాటిగా ఆడుతున్న ఫకర్ జమాన్ 62 పరుగులు చేసి ఔటయ్యాడు. 26 ఓవర్లలో 126 పరుగులు చేసింది పాకిస్థాన్

2019-06-16 21:41:01

అర్ధసెంచరీ చేయకుండానే బాబర్ ఆజమ్ ఔట్

భారత్​తో ప్రపంచకప్​ మ్యాచ్​ ఆడుతున్న పాకిస్థాన్.. ఆచితూచి ఆడుతోంది. ఈ క్రమంలో  48 పరుగులు చేసిన బాబార్ ఆజమ్ కుల్​దీప్​ బౌలింగ్​లో ఔటయ్యాడు.  ప్రస్తుతం 24 ఓవర్లలో  రెండు వికెట్లు​ నష్టానికి 117 పరుగులు చేసింది పాకిస్థాన్.

2019-06-16 21:36:02

అర్ధశతకం సాధించిన పాక్​ ఓపెనర్​

పాక్​ ఓపెనర్​ ఫకర్​ జమాన్​ అర్థశతకం సాధించాడు. వన్డేల్లో 10వ హాఫ్​ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 61 బంతుల్లో 51 పరుగులతో కొనసాగుతున్నాడు.

2019-06-16 21:33:55

స్కోరును నెెమ్మదిగా పరుగులెత్తిస్తున్న పాక్​ బ్యాట్స్​మెన్లు

పాక్​ బ్యాట్స్​మెన్​ బాబర్​, ఫకర్​ జమాన్​ వికెట్​ పడకుండా ఆడుతున్నారు. 20 ఓవర్లకు 87 పరుగులు చేసిన పాక్​ జట్టు. 59 బంతుల్లో అర్ధశతకం సాధించిన ఫకర్​ జమాన్​.

2019-06-16 21:03:09

వేసిన తొలి బంతికే విజయ్ శంకర్​కు వికెట్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నెమ్మదిగానే ఛేదనను ఆరంభించింది. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు ఆల్​రౌండర్ విజయ్ శంకర్. 7 పరుగులు చేసిన ఇమాముల్ హక్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 5  ఓవర్లలో 14 పరుగులు చేసింది పాక్.

2019-06-16 20:18:02

337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్

ఎంతో ఉత్కంఠగా సాగుతున్న నేటి ప్రపంచకప్​ మ్యాచ్​లో పాకిస్థాన్ బ్యాటింగ్​ ప్రారంభించింది. తొలి ఓవర్​ ముగిసే సరికి వికెట్లేమి నష్టపోకుండా 2 పరుగులు చేసింది.

2019-06-16 19:54:55

భారత్- పాక్ మ్యాచ్​తో వర్షం దోబూచులాట

ఓల్డ్​ ట్రఫోర్డ్​ వేదికగా జరుగుతున్న భారత్- పాకిస్థాన్ ప్రపంచకప్​ మ్యాచ్​తో వరుణుడు ఆడుకుంటున్నాడు.  ఇన్నింగ్స్​ 47 ఓవర్​లో కురిసిన వర్షం.. మళ్లీ భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదలైంది. ఈ మ్యాచ్​లో పాక్​ ఎదుట 337 పరుగులు భారీ లక్ష్యం ఉంది.  మరి ఛేదిస్తారా చతికిలపడతారా అనేది తేలాల్సి ఉంది.

2019-06-16 19:38:06

పాకిస్థాన్​కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా

ఎంతో ఆసక్తిగా సాగిన భారత్- పాక్ ప్రపంచకప్​ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 140 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కోహ్లీ 77 పరుగులు, రాహుల్ 57 పరుగులు చేశాడు.

పాకిస్థాన్ బౌలర్లలో ఆమిర్ మూడు వికెట్ల తీయగా, రియాజ్, అలీ తలో వికెట్ దక్కించుకున్నాడు.

2019-06-16 19:23:04

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆమిర్ బౌలింగ్​లో కీపర్ క్యాచ్​గా వెనుదిరిగాడు. 65 బంతుల్లో 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 48 ఓవర్లలో 315 పరుగులు చేసింది టీమిండియా.

2019-06-16 19:11:08

ఇన్నింగ్స్​ చివర్లో ఔటైన కెప్టెన్ కోహ్లీ

తిరిగి ప్రారంభమైన భారత్ -పాక్ మ్యాచ్​ 

వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్​ కాసేపట్లో తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, విజయ్ శంకర్ ఉన్నారు.

2019-06-16 19:07:17

మ్యాచ్​కు వరుణుడు అడ్డంకి

టీమిండియా-పాకిస్థాన్​ మ్యాచ్​కు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం 46.4 ఓవర్లలో  నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది టీమిండియా. క్రీజులో కోహ్లి-71 పరుగులు, విజయ్ శంకర్ 3 పరుగులతో ఉన్నారు.

2019-06-16 18:14:24

భారీ లక్ష్యం దిశగా కోహ్లీ పోరాటం

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ పాక్​ బౌలర్లను అడ్డుకుని పరుగులు సాధిస్తున్నాడు. మరో ఎండ్​లో వికెట్లు పడినా 61 బంతుల్లో 70 స్కోర్​ చేశాడు. 46వ ఓవర్లలో 300 మార్కును దాటింది భారత్.​

2019-06-16 18:09:55

నాలుగో వికెట్​గా బరిలోకి దిగిన ధోనీ నిరాశపరిచాడు. 2 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. తొలిసారి ఈ ప్రపంచకప్​లో విజయ్​ శంకర్​ మైదానంలో బ్యాటింగ్​ చేస్తున్నాడు.

2019-06-16 18:06:44

నాలుగో వికెట్​గా వెనుదిరిగిన ధోనీ

భారత హార్డ్​ హిట్టర్​ హార్దిక్​ పాండ్య 19 బంతుల్లో 26 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. 286 పరుగుల వద్ద భారత్​ మూడో వికెట్​ కోల్పోయింది. ఆమిర్​ బౌలింగ్​లో పాండ్యా క్యాచ్​ రూపంలో వికెట్​ సమర్పించుకున్నాడు.

2019-06-16 18:00:13

మూడో వికెట్​గా వెనుదిరిగిన హార్దిక్​

పాక్​ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ 51 బంతుల్లో అర్ధశతకం సాధించాడు కోహ్లీ. కెరీర్​లో మరో 50 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.

2019-06-16 17:49:37

పాక్​ బౌలర్లపై విరుచుకుపడుతున్న విరాట్​-హార్దిక్​ ద్వయం

రెండో వికెట్​ కోల్పోయిన భారత్

నిలకడగా ఆడుతున్న టీమిండియా రెండో వికెట్​ కోల్పోయింది. 140 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. హసన్ అలీ బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీకి తోడుగా హార్దిక్ పాండ్య ఉన్నాడు. 39 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది టీమిండియా.

2019-06-16 17:36:01

దూకుడు పెంచిన రోహిత శర్మ

 ప్రస్తుతం 36 ఓవర్లలో వికెట్​ నష్టానికి  215 పరుగులు చేసింది టీమిండియా. సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 126 పరుగులు చేశాడు. మరో ఎండ్​లో కోహ్లీ 26 పరుగులతో ఉన్నాడు.

2019-06-16 17:22:27

శతకంతో అదరగొట్టిన రోహిత్ శర్మ

తనపై ఉన్న అంచనాల్ని నిలబెడుతూ రోహిత్​శర్మ.. 85 బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుతం 30 ఓవర్లలో 172 పరుగులు చేసింది టీమిండియా. దూకుడుగా ఆడుతోంది టీమిండియా. ఈ ప్రపంచకప్​లో ఈ క్రికెటర్​కు ఇది రెండవ సెంచరీ. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాతో మ్యాచ్​లో 122 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

2019-06-16 16:57:58

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ

శతకానికి చేరువలో ఓపెనర్ రోహిత్ శర్మ

 పాక్​తో మ్యాచ్​లో ఓపెనర్​ రోహిత్ శర్మ సెంచరీకి చేరువలో ఉన్నాడు.  ప్రస్తుతం 27 ఓవర్లలో 160 పరుగులు చేసింది భారత జట్టు. రోహిత్  77 బంతుల్లో 92 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్​  కోహ్లీ ఉన్నాడు.

2019-06-16 16:48:36

మొదటి వికెట్​గా వెనుదిరిగిన రాహుల్

పాకిస్థాన్​తో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​ ఓపెనర్​గా వచ్చిన కేఎల్ రాహుల్ 57 పరుగులు చేసి తొలి వికెట్​గా వెనుదిరిగాడు. వాహబ్ రియాజ్ బౌలింగ్​లో షాట్​ ఆడబోతూ క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. క్రీజులో కోహ్లి, రోహిత్ ఉన్నారు. 24 ఓవర్లకు 136 పరుగులు చేసింది టీమిండియా.

2019-06-16 16:35:55

అర్ధసెంచరీతో అదరగొట్టిన రాహుల్

ప్రపంచకప్​ మ్యాచ్​ పాక్​తో మ్యాచ్​లో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఈ క్రమంలో ఓపెనర్​గా వచ్చిన రాహుల్ వన్డేల్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటికే రోహిత్ అర్ధశతకం చేసి జోరుమీదున్నాడు. ప్రస్తుతం 22 ఓవర్లకు 123 పరుగులు చేసింది.

2019-06-16 16:20:07

మైదానంలో తమిళ హీరో శివకార్తికేయన్

భారత్​-పాక్​ మ్యాచ్​ అంటే సాధారణ ప్రజల నుంచి ప్రముఖులు వరకు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఇంగ్లండ్​కు వెళ్లి మైదానంలో మ్యాచ్​ను ప్రత్యక్షంగా మ్యాచ్​ను వీక్షిస్తున్నారు. ఇంతకు ముందు మంచు లక్ష్మి, రణ్​వీర్ సింగ్ విచ్చేశారు. ఇప్పుడు తమిళ హీరో శివకార్తికేయన్​తో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హాజరయ్యాడు. 

2019-06-16 16:13:51

భారత్ ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం

ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్​  మ్యాచ్​లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం 18 ఓవర్లలో 101 పరుగులు చేసింది. రోహిత్ 61, రాహుల్ 37 పరుగులు చేశారు. 

2019-06-16 16:07:10

రవిచంద్రన్​తో హీరో శివ కార్తికేయన్

రోహిత్​ శర్మ అర్ధ శతకం

తొలి నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 43 హాఫ్​ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం 12 ఓవర్లలో 79 పరుగులు చేసింది టీమిండియా.

2019-06-16 15:52:04

నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు

టాస్ ఓడి బ్యాటింగ్​ చేస్తున్న భారత్​.. 9 ఓవర్లకు 46 పరుగులు చేసింది. గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో వచ్చిన రాహుల్ పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నాడు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు.

2019-06-16 15:32:39

భారత్​ - పాక్​ మ్యాచ్​ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మాంచెస్టర్​ చేరుకున్న బాలీవుడ్​, టాలీవుడ్​ ప్రముఖులు ఓల్డ్​ ట్రాఫోర్డ్​ మైదానంలో సందడి చేస్తున్నారు. రణ్​వీర్​ సింగ్​, మంచు లక్ష్మీలు టీమిండియాకు మద్ధతుగా నిలుస్తున్నారు.

2019-06-16 15:24:53

స్టేడియంలో సెలెబ్రిటీలు

భారత్​-పాక్​ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. కోట్లాది మంది ప్రేక్షకులు మ్యాచ్​ను పరోక్షంగా వీక్షిస్తుండగా... వేలాది మంది ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంగ్లాండ్​ మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ ఈ అద్భుత అనుభూతికి వేదికైంది. ఈ సందర్భంగా తరలివచ్చిన అభిమానుల నుంచి కొన్ని విభిన్న దృశ్యాలు కెమేరాలో బంధించబడ్డాయి.

2019-06-16 15:17:26

ఆమిర్​కు అంపైర్ మరో​ వార్నింగ్​

గాయపడ్డ ధావన్ స్థానంలో ఆల్​రౌండర్ విజయ్ శంకర్​ జట్టులో చోటు సంపాదించాడు. రోహిత్​కు జోడీగా లోకేశ్ రాహుల్​ ఇన్నింగ్స్​ ఆరంభించాడు.

ఇరుజట్లు

భారత్​ :రోహిత్ శర్మ, లోకేశ్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), విజయ్​ శంకర్​, ఎంఎస్​ ధోనీ(వికెట్​ కీపర్​), కేదార్​ జాదవ్​, హార్దిక్​ పాండ్య, భువనేశ్వర్​ కుమార్​, కుల్దీప్ యాదవ్​, చాహల్​, బుమ్రా

పాకిస్థాన్​ :ఇమాముల్​ హక్​, ఫఖర్ జమాన్​, బాబర్​ అజామ్​, మహమ్మద్​ హఫీజ్​, సర్ఫరాజ్​ అహ్మద్​, షోయబ్​ మాలిక్​, ఇమాద్ వసీం, షాదబ్​ఖాన్​, హసన్​ అలీ, వాహబ్​ రియాజ్​, అమీర్​

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

2019-06-16 15:03:41

విచిత్ర వేషధారణలో ప్రపంచకప్​కు

టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్​లో పాకిస్థాన్​ సారిథి సర్ఫరాజ్​ ఖాన్​ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మాంచెస్టర్​లో గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తున్నందున ఛేజింగ్​ చేయాలని నిర్ణయించుకున్నాడు.

2019-06-16 14:40:12

ధావన్​ స్థానంలో శంకర్​...

భారత ఆల్ రౌండర్ విజయ్​ శంకర్​ నెట్స్​లో  శ్రమిస్తున్నాడు. బుమ్రా, భువీలతో కలిసి బౌలింగ్​పై కసరత్తులు చేస్తున్నాడు. ఫలితంగా గాయపడ్డ ఓపెనర్​ శిఖర్​ధావన్​ స్థానంలో శంకర్​ వచ్చే ఆవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు.

2019-06-16 14:33:21

బౌలింగ్​ ఎంచుకున్న పాక్​

భారత్​- పాక్​ మ్యాచ్ జరగనున్న మాంచెస్టర్​లో ఆకాశం మేఘావృతమై ఉంది. అయినప్పటికీ మ్యాచ్​కు ఇప్పుడైతే ఏ ప్రమాదమూ లేదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్​ మధ్యలో వర్షం కురిసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రకటించారు. ఒకవేళ వర్షం కురిసినా పూర్తి మ్యాచ్​కు అంతరాయం కలుగకపోవచ్చని తెలిపారు. స్టేడియానికి భారీగా చేరుకున్న అభిమానులు మ్యాచ్​ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2019-06-16 14:24:33

ధావన్​ స్థానంలో శంకర్​?

ప్రపంచకప్​లో నేడు కీలక మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. భారత్-పాక్ మధ్య మాంచెస్టర్ వేదికగా మరికాసేపట్లో హోరాహోరి పోరు ప్రారంభం కానుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ పరాభవానికి బదులు తీర్చుకోవాలని కోహ్లీసేన కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్​లో గెలిచి చరిత్ర తిరగరాయాలని సర్ఫరాజ్​ సేన భావిస్తోంది.

భారత్​, పాక్​ ద్వైపాక్షిక సిరీస్​లు ఆడక 6 సంవత్సరాలు దాటింది. చివరిసారిగా 2012-13లో భారత్​లో పర్యటించింది పాక్​. అనంతరం భారత్​ పాక్​కు గాని.. పాకిస్థాన్​​ భారత్​కు గానీ.. క్రికెట్​ కోసం రాలేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడ్డాయి ఇరు జట్లు. అయితే.. అందులోనూ పూర్తి ఆధిపత్యం టీమిండియాదే. పాకిస్థాన్​ ఇప్పటివరకు ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్​పై గెలిచిందే లేదు. వన్డే ప్రపంచకప్​లో ముఖాముఖి 6 సార్లు తలపడగా.. అన్ని సార్లు భారత్​దే విజయం.

ప్రపంచకప్​లో ఇరు జట్లు...

ప్రపంచ కప్​ ఫలితం మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్
1992 43 పరుగుల తేడాతో భారత్​ గెలుపు సచిన్​ తెందుల్కర్​
1996 39 పరుగుల తేడాతో భారత్​ గెలుపు నవ్​జోత్​ సిద్ధూ
1999 47 పరుగుల తేడాతో టీమిండియా విజయం వెంకటేశ్​ ప్రసాద్​
2003 6 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు సచిన్​ తెందుల్కర్​
2011 29 పరుగుల తేడాతో భారత్​ విజయం సచిన్​ తెందుల్కర్​
2015 76 పరుగులు తేడాతో భారత్​దే మ్యాచ్ విరాట్​ కోహ్లీ​

2019-06-16 14:14:27

మేఘావృతమైన మాంచెస్టర్​ ఆకాశం

2019-06-16 14:04:04

స్టేడియం వద్ద అభిమానుల కోలాహలం

2019-06-16 13:40:08

Last Updated : Jun 16, 2019, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details