తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్కంఠ మ్యాచ్​లో భారత్ పరాజయం.. ఫైనల్లో కివీస్​

భారత్​Xకివీస్​: రెండో రోజు తొలకరి తప్పదేమో...!

By

Published : Jul 10, 2019, 2:08 PM IST

Updated : Jul 10, 2019, 7:53 PM IST

19:27 July 10

భారత్​పై కివీస్ విజయం

ప్రపంచకప్​లో భాగంగా భారత్​తో జరిగిన సెమీస్ మ్యాచ్​లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో నెగ్గి ఫైనల్​ చేరింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో కివీస్ రెండో సారి ఫైనల్ చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్ 221 పరుగలకు ఆలౌటైంది. జడేజా(77), ధోని(50) ఆకట్టుకున్నప్పటికీ మ్యాచ్​ను గెలిపించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, బౌల్ట్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

3 వికెట్లతో ఆకట్టుకున్న మ్యాట్ హెన్రీకి  మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

19:18 July 10

రనౌట్​ అయిన ధోని

48వ మూడో బంతిని షాట్​ కొట్టాడు ధోని(49). రెండో బంతికి ప్రయత్నించి రనౌట్​ అయ్యాడు. ప్రస్తుతం భారత్ గెలవాలంటే 9 బంతుల్లో 24 పరుగులు చేయాలి. 

19:11 July 10

బౌల్ట్​ బౌలింగ్​లో జడేజా ఔట్​

47వ ఓవర్ 5వ బంతికి జడేజాను ఔట్ చేశాడు బౌల్ట్​. 77 పరుగులు చేసిన జడ్డూ విలియమ్సన్​కు క్యాచ్ ఇచ్చాడు. భారత్​ గెలవాలంటే 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి

19:07 July 10

47 ఓవర్లుకు భారత్ స్కోరు

47వ ఓవర్ వేసిన హెన్రీ ఐదు పరుగులు ఇచ్చాడు. భారత్ గెలవాలంటే 18 బంతుల్లో 37 పరుగులు చేయాలి.

18:57 July 10

46 ఓవర్లకు భారత్ స్కోరు 198/6

45వ ఓవర్ వేసిన ఫెర్గ్యూసన్ ఓ సిక్సర్ సహా పది పరుగులు ఇచ్చాడు. అనంతరం బౌల్ట్​ వేసిన 46వ ఓవర్లో 10 పరుగుల వచ్చాయి. భారత్ గెలవాలంటే 24 బంతుల్లో 42 పరుగులు చేయాలి. క్రీజులో ధోని(35), జడేజా(74) ఉన్నారు. 

18:49 July 10

44 ఓవర్లకు భారత్ స్కోరు 178/6

43వ ఓవర్ వేసిన ఫెర్గ్యూసన్ మూడు పరుగులే ఇచ్చాడు. అనంతరం 44వ ఓవర్లో నీషమ్ 7 పరుగులు ఇచ్చాడు. క్రీజులో జడేజా(59), ధోనీ(30) ఉన్నారు. భారత్ గెలవాలంటే 36 బంతుల్లో 62 పరుగులు చేయాలి
 

18:40 July 10

జడేజా అర్ధశతకం

బ్యాట్స్​మెన్ పెవిలియన్ బాట పడుతున్ వేళ జడేాజా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 167/6

18:35 July 10

41 ఓవర్లకు భారత్ స్కోరు 159/6

సాంట్నర్ వేసిన 41వ ఓవర్లో ఓ సిక్స్ సహా 9 పరుగులు ఇచ్చాడు. జడేజా(45) దూకుడు కొనసాగిస్తున్నాడు. 

18:31 July 10

40 ఓవర్లకు భారత్​ స్కోరు 150/6

39వ ఓవర్ వేసిన సాంట్నర్ ఓ ఫోర్ సహా 10 పరుగులు ఇచ్చాడు. అనంతరం ఫెర్గూసన్ వేసిన 40వ ఓవర్లో ఓ ఫోర్ సహా 9 పరుగులు వచ్చాయి. క్రీజులో జడేజా(39), ధోనీ(24) ఉన్నారు.
 

18:21 July 10

38 ఓవర్లకు భారత్ స్కోరు 131/6

సాంట్నర్​ వేసిన 37వ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. అనంతరం 38వ ఓవర్లో మ్యాట్ హెన్రీ ఓ ఫోర్ సహా పరుగులు ఇచ్చాడు. క్రీజులో ధోని(22), జడేజా(24) ఉన్నారు
 

17:59 July 10

జడేజా తొలి సిక్స్​...

అభిమానులు నిరాశ, మ్యాచ్​పై పట్టు కోల్పోయిందని ప్రత్యర్థి ఆశిస్తున్న సమయంలో సిక్స్​ కొట్టాడు జడేజా. క్రీజులో ఉన్న ధోనీ, జడ్డూ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపిస్తున్నారు.

17:46 July 10

సాంట్నర్ బౌలింగ్​లో పాండ్య ఔట్​

సాంట్నర్ వేసిన 31వ ఓవర్ మూడో బంతికి పాండ్య ఔటయ్యాడు. షాట్​కు ప్రయత్నించి విలియమ్సన్​కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తతుం భారత్​ స్కోరు 92/6

17:41 July 10

29 ఓవర్లకు భారత్ స్కోరు 85/5

28వ ఓవర్ వేసిన ఫెర్గ్యూసన్ ఒక్క పరుగే ఇచ్చాడు. అనంతరం 29వ ఓవర్లో సాంట్నర్ రెండు పరుగుల ఇచ్చాడు. 19.6వ ఓవర్​ తర్వాత 32.3వ ఓవర్​లో జడేజా సిక్స్​ కొట్టడం విశేషం.

17:34 July 10

27 ఓవర్లకు భారత్ స్కోరు 82/5

26వ ఓవర్ వేసిన ఫెర్గ్యూసన్ 3 పరుగుల ఇచ్చాడు. అనంతరం సాంట్నర్ వేసిన 27వ ఓవర్లో పరగులే వచ్చాయి. క్రీజులో ధోని(2), పాండ్య(30) ఉన్నారు.

17:26 July 10

25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 77/5

25వ ఓవర్ వేసిన సాంట్నర్ 2 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో ధోని(1), పాండ్య(26) ఉన్నారు. 

17:24 July 10

24 ఓవర్లకు భారత్​ స్కోరు 75/5

పంత్ ఔటైన తర్వాత ధోని(1) క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. 

17:19 July 10

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

సాంట్నర్ వేసిన 23వ ఓవర్ 5వ బంతికి పంత్(32) ఔటయ్యాడు. భారీ షాట్​కు ప్రయత్నించి బౌండరీ లైన్లో గ్రాండ్ హౌమ్​కు క్యాచ్​ ఇచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 71/5

17:08 July 10

21 ఓవర్లకు భారత్ స్కోరు 70/4

20వ ఓవర్ వేసిన జేమ్స్ నీషమ్ ఓ ఫోర్ సహా 8 పరుగుల ఇచ్చాడు. అనంతరం సాంట్నర్ వేసిన 21వ ఓవర్ మెయిడెన్ అయింది. 

17:02 July 10

19 ఓవర్లకు భారత్ స్కోరు 62/4

18వ ఓవర్ వేసిన గ్రాండ్ హోమ్ 9 పరుగులు ఇచ్చాడు. అనంతరం ఫెర్గ్యూసన్ వేసిన 19వ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. క్రీజులో పాండ్య(19), పంత్(27) ఉన్నారు. 

16:52 July 10

17 ఓవర్లకు భారత్ స్కోరు 51/4

16వ ఓవర్ వేసిన గ్రాండ్ హోమ్ 4 పరుగులు ఇచ్చాడు. అనంతరం ఫెర్గ్యూసన్ వేసిన 17వ ఓవర్ మొదటి బంతిని పాండ్య గాల్లోకి లేపాడు. అయితే ఫీల్డర్లకు బంతి అందలేదు. ఆ ఓవర్లో పరుగులు వచ్చాయి. 

16:41 July 10

15 ఓవర్లకు భారత్ స్కోరు 43/4

14వ ఓవర్ వేసిన హెన్రీ ఓ ఫోర్ సహా 5 పరుగులు ఇచ్చాడు. అనంతరం ఫెర్గ్యూసన్ వేసి 15వ ఓవర్లో ఒక్క పరుగే వచ్చింది. క్రీజులో పంత్(20), పాండ్య(9) ఉన్నారు.

16:33 July 10

13 ఓవర్లకు భారత్ స్కోరు 37/4

13వ ఓవర్ ఫెర్గ్యూసన్ వేశాడు. ఆ ఓవర్లో రెండే పరుగులు ఇచ్చాడు. క్రీజులో పంత్(19), పాండ్య(5) ఉన్నారు.

16:26 July 10

12 ఓవర్లకు భారత్ స్కోరు 35/4

11వ ఓవర్ వేసిన బౌల్ట్ 6 పరుగులు ఇచ్చాడు. 12వ ఓవర్ వేసిన హెన్రీ ఓ ఫోర్ సహా 5 పరుగుల ఇచ్చాడు. క్రీజులో పంత్(18), పాండ్య(4) ఉన్నారు

16:17 July 10

9 ఓవర్లకు భారత్ స్కోరు 19/3. 

8వ ఓవర్ వేసిన మ్యాట్ హెన్రీ  రెండు పరుగులు ఇచ్చాడు. అనంతరం బౌల్ట్ వేసిన 9వ ఓవర్లో 6 పరుగులు ఇచ్చాడు. 

16:11 July 10

7వ ఓవర్​ మెయిడిన్​...

బౌల్ట్​ వేసిన 7వ ఓవర్​ మెయిడిన్​గా ముగిసింది. పంత్​(5), కార్తీక్​(0) క్రీజులో ఉన్నారు.

7 ఓవర్లకు భారత్​ స్కోరు- 10/3

16:05 July 10

35వ బంతికి ఫోర్​...

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్​, కార్తీక్​ ఆదుకుంటున్నారు. ఎట్టకేలకు 35వ బంతికి తొలి బౌండరీ లభించింది. హెన్రీ బౌలింగ్​లో ఇద్దరి ఫీల్డర్ల మధ్య నుంచి ఫోర్​ కొట్టాడు పంత్​.

16:01 July 10

5 ఓవర్లకు భారత్ స్కోరు 6/3

5 ఓవర్ వేసిన బౌల్ట్ ఒక్క పరుగే ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో  పంత్(1), కార్తీక్(0) ఉన్నారు. 

15:54 July 10

హెన్రీ బౌలింగ్​లో రాహుల్ ఔట్

రోహిత్ వికెట్ తీసి జోరు మీదున్న హెన్రీ మరో వికెట్ తీసుకున్నాడు. కే ఎల్ రాహుల్​ను ఔట్ చేసి భారత్​ను దెబ్బ తీశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 5/3

15:48 July 10

బౌల్ట్​ బౌలింగ్​లో కోహ్లీ ఔట్​

మూడో ఓవర్ నాలుగో బంతికి కోహ్లీని ఔట్​ చేశాడు బౌల్ట్​. విరాట్(1) రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 5/2

15:46 July 10

టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ వేసిన హెన్రీ 3వ బంతికి రోహిత్​(1)ను ఔట్ చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4/1

15:38 July 10

హెన్రీ బౌలింగ్​లో రోహిత్ ఔట్​

మొదటి ఓవర్లో టీమిండియా స్కోరు 2/0

240 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగింది భారత్​. తొలి ఓవర్ వేసిన కివీస్ బౌలర్ బౌల్ట్​ 2 పరుగులు ఇచ్చాడు. క్రీజులో రోహిత్(1), రాహుల్(1) ఉన్నారు

15:32 July 10

రెండో రోజు తిరిగి ఇన్నింగ్స్​ ఆరంభించిన న్యూజిలాండ్​.. తడబడింది. భారత ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతో తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది బ్లాక్​ క్యాప్స్​.  

భారత బౌలర్లలో భువనేశ్వర్​ 3 వికెట్లతో విజృంభించాడు. బుమ్రా, పాండ్య, చాహల్​, జడేజా ఒక్కో వికెట్​ తీశారు. 

15:16 July 10

50 ఓవర్లకు కివీస్​ స్కోరు.. 239/8

ఈ మ్యాచ్​లో జడేజా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అద్భుత త్రో వేసి టేలర్​ను రనౌట్​ చేసిన మరుసటి బంతికే బౌండరీ లైన్​ వద్ద గొప్ప క్యాచ్​ పట్టాడు. 10 పరుగులు చేసిన లాథమ్​.. భువీ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

అదే ఓవర్​ చివరి బంతికి హెన్రీని పెవిలియన్​ చేర్చాడు భువనేశ్వర్​

49 ఓవర్లకు న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి​ 232 పరుగుల వద్ద ఉంది.  

15:11 July 10

8 వికెట్లు కోల్పోయిన కివీస్​

48 ఓవర్​ చివరి బంతికి జడేజా అద్భుత త్రో వేసి టేలర్​ను రనౌట్​ చేశాడు. చాలా దూరం నుంచి స్ట్రెకింగ్​ వైపు.. డైరెక్ట్​గా వికెట్లను గిరాటేశాడు. కివీస్​ స్కోరు 48  ఓవర్లకు 225/6

15:05 July 10

జడేజా మాయ.. టేలర్​ రనౌట్​

భువనేశ్వర్​ 47వ ఓవర్​ కొనసాగించాడు. న్యూజిలాండ్ స్కోరు 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది కివీస్​. టేలర్​, లాథమ్​ క్రీజులో ఉన్నారు. భువనేశ్వర్​ ఓవర్లో 8 పరుగులొచ్చాయి. 

15:00 July 10

47 ఓవర్లకు స్కోరు 217/5

మొదటిరోజు వర్షం కారణంగా మ్యాచ్​ రద్దుతో రెండో రోజు ఆట ప్రారంభమైంది. 

14:59 July 10

రెండో రోజు మ్యాచ్​ ప్రారంభం

మ్యాచ్​ మరికాసేపట్లో ప్రారంభం అవుతుందనగా క్రికెట్​ దేవుడు, భారత మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్​ తెందుల్కర్​ మైదానంలోకి ప్రవేశించాడు. అంతే.. ఒక్కసారిగా ప్రేక్షకులు సచిన్​.. సచిన్​ అంటూ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. 

14:55 July 10

మ్యాచ్​కు ముందు సచిన్​ సందడి..

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు వర్షం పడే అవకాశాలు లేవని రాడార్​ సూచిస్తుంది. ఈ లోపు కివీస్​ ఇన్నింగ్స్​లో మిగిలున్న 3.5 ఓవర్లతో పాటు.. ఓవర్లు కుదిస్తే భారత్​కు 20 ఓవర్లు బ్యాటింగ్​ చేసే అవకాశం రావొచ్చు. ఇన్నింగ్స్​ విరామ సమయమూ తగ్గిస్తే.. ఈ 23.5 ఓవర్లకు 2 గంటలకు మించి పట్టదు. కాబట్టి... మ్యాచ్​లో ఫలితం వచ్చే అవకాశముంది. 

14:48 July 10

20 ఓవర్ల వరకు డోకా లేదు..

ఎలాంటి ఆటంకం లేకుండా వాతావరణం అనుకూలిస్తే మ్యాచ్​ 3 గంటలకే ప్రారంభం కానుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్ష సూచనలు తక్కువగా ఉన్నాయి. మ్యాచ్​ ఇన్నింగ్స్​ విరామం ఎంత సమయం అన్నది న్యూజిలాండ్​ బ్యాటింగ్​ ముగిసిన అనంతరం... తెలిసే అవకాశాలున్నాయి. వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని.. సమయాన్ని కుదించనున్నారు. 

14:39 July 10

మరికొద్దిసేపట్లో మ్యాచ్​ ప్రారంభం

న్యూజిలాండ్​ ఇన్నింగ్స్​ ముగియడానికి 23 బంతులు మాత్రమే మిగిలే ఉన్నాయి. మ్యాచ్​ ప్రారంభమైన... 40-45 నిమిషాల్లోపే టీమిండియా బ్యాటింగ్​కు రావచ్చు. మ్యాచ్​కు ముందు కెప్టెన్​ కోహ్లీ, హిట్టర్​ హార్దిక్​ పాండ్యలు షాట్​లు సాధన చేస్తూ కనిపించారు. విరాట్​ కోహ్లీ ఎక్కువగా ముందుకొచ్చి... కవర్​డ్రైవ్​లు ప్రాక్టీస్​ చేశాడు. హిట్టర్​ పాండ్య.. భారీ షాట్లు ప్రాక్టీస్​ చేశాడు. ఒకవేళ.. ఓవర్లు కుదిస్తే పాండ్య కొంచెం ముందు స్థానాల్లో బ్యాటింగ్​కు వచ్చే అవకాశాలున్నాయి. 

14:28 July 10

కోహ్లీ, పాండ్య బ్యాటింగ్​ ప్రాక్టీస్​

మరికాసేపట్లో మ్యాచ్​ ప్రారంభమవుతుందనగా... కివీస్​ బ్యాటింగ్​, బౌలింగ్​ ప్రాక్టీస్​ చేసింది. 8వ స్థానంలో బ్యాటింగ్​కు వచ్చే మిచెల్​ సాంట్నర్​.. ఎక్కువ సేపు ప్రాక్టీస్​ చేస్తూ కనిపించాడు. భారత టాప్​ ఆర్డర్​ను త్వరగా పెవిలియన్​ చేర్చే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు న్యూజిలాండ్​ పేస్​ త్రయం బౌల్ట్​, హెన్రీ, ఫెర్గూసన్​.

14:22 July 10

ప్రాక్టీస్​తో బిజీబిజీగా...

భారత్​-కివీస్​ మధ్య సెమీఫైనల్​ మ్యాచ్​ ఈ  రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ.. పూర్తి ఓవర్ల ఆట సాధ్యపడకపోవచ్చు. ఓవర్లు కుదించే అవకాశముంది. బుధవారం మ్యాచ్​ ముగిసే సమయానికి.. న్యూజిలాండ్​ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. టేలర్​ 67, లాథమ్​ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంకా న్యూజిలాండ్​ ఇన్నింగ్స్​ ముగిసేందుకు 23 బంతులున్నాయి. కివీస్​.. 30 నుంచి 35 పరుగులు జోడించినా 240-50 మధ్యలో భారత్​కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశాలున్నాయి. 

వర్షసూచనలతో ఇన్నింగ్స్​ విరామం.. 10 నిమిషాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. 

14:14 July 10

3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం..!

న్యూజిలాండ్‌- భారత్​ మధ్య మంగళవారం జరుగుతున్న ప్రపంచకప్‌ సెమీఫైనల్​ మ్యాచ్‌ను వరుణుడు ఆటంకపరిచిన విషయం తెలిసిందే. వర్షం ఎక్కువ కావడం వల్ల నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. తర్వాత వాన ఎంతకీ తగ్గకపోవడం వల్ల ఆటను బుధవారానికి వాయిదా వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు 46.1 ఓవర్ల నుంచే మ్యాచ్‌ మొదలు కానుంది.

ప్రస్తుతానికి వర్షం నుంచి కాస్త ఉపశమనం లభించినా... ఈ రోజు కూడా మాంచెస్టర్‌లో వర్షం కురిసే అవకాశమున్నట్లు అక్కడి వాతావరణశాఖ తెలిపింది.  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు,  ఆ తర్వాత గంటసేపటికి వర్షం తగ్గినా.. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల 30 నిముషాలకు చినుకులు మళ్లీ పలకరించవచ్చని సమాచారం. వరుణుడి వల్ల టీమిండియాకు పెద్ద సవాలే ఎదురుకానుంది.

కివీస్‌ బౌలర్లు లాకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

13:46 July 10

ఆకాశంలో సూర్యుడు

న్యూజిలాండ్‌- భారత్​ మధ్య మంగళవారం జరుగుతున్న ప్రపంచకప్‌ సెమీఫైనల్​ మ్యాచ్‌ను వరుణుడు ఆటంకపరిచిన విషయం తెలిసిందే. వర్షం ఎక్కువ కావడం వల్ల నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. తర్వాత వాన ఎంతకీ తగ్గకపోవడం వల్ల ఆటను బుధవారానికి వాయిదా వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు 46.1 ఓవర్ల నుంచే మ్యాచ్‌ మొదలు కానుంది.

ప్రస్తుతానికి వర్షం నుంచి కాస్త ఉపశమనం లభించినా... ఈ రోజు కూడా మాంచెస్టర్‌లో వర్షం కురిసే అవకాశమున్నట్లు అక్కడి వాతావరణశాఖ తెలిపింది.  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు,  ఆ తర్వాత గంటసేపటికి వర్షం తగ్గినా.. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల 30 నిముషాలకు చినుకులు మళ్లీ పలకరించవచ్చని సమాచారం. వరుణుడి వల్ల టీమిండియాకు పెద్ద సవాలే ఎదురుకానుంది.

కివీస్‌ బౌలర్లు లాకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Jul 10, 2019, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details