ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

తిప్పేసిన అఫ్గాన్​ స్పిన్నర్లు- భారత్​ 224/8 - కోహ్లీ, కేదార్​ అర్ధశతకాలు..

సౌతాంప్టన్​ వేదికగా అఫ్గాన్​తో పోరులో టీమిండియా ఊహించని రీతిలో తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బ్యాట్స్​మన్లలో విరాట్​, కేదార్​ అర్ధశతకాలతో రాణించారు.

పసికూన బౌలింగ్​కు తలవంచిన టీమిండియా... అఫ్గాన్​ లక్ష్యం 225
author img

By

Published : Jun 22, 2019, 7:06 PM IST

ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో మ్యాచ్​లో భారత​ బ్యాట్స్​మన్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఆరంభించిన కోహ్లీ సేన... అఫ్ఘాన్​కు 225 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.

రోహిత్​ విఫలం...

భారత జట్టు ఓపెనర్​ రోహిత్​ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కే.ఎల్​ రాహుల్​ (30), కోహ్లీ (67) కలసి ఆచితూచి ఆడుతూ మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే రాహుల్​ ఔటయ్యాక.. విజయ్​ శంకర్ ​(29), ధోనీ (28), హార్దిక్​ (7) స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోయారు. హిట్టర్​గా పేరున్న హార్దిక్​ ఈ మ్యాచ్​లో బాగా నిరాశపరిచాడు. ధోనీ 58 బంతుల్లో 28 పరుగులు చేసి చివరికి స్టంపౌట్​గా వెనుదిరిగాడు.

కోహ్లీ, కేదార్​ అర్ధశతకాలు..

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే కారణం విరాట్​, కేదార్​ బ్యాటింగ్​. కోహ్లీ 63 బంతుల్లో 67 పరుగులు, కేదార్​ జాదవ్​ 68 బంతుల్లో 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్​ ఆడారు. స్పిన్​కు అనుకూలించిన మైదానంలో... మ్యాచ్​ మొత్తంలో ఒకే ఒక్క సిక్స్​ నమోదవడం గమనార్హం.

బంగ్లా బౌలర్లు సమష్టిగా పోరాటం చేసి వికెట్లు తీశారు. నైబ్​, నబీ చెరో 2 వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు తలో ఒక వికెట్​ ఖాతాలో వేసుకున్నారు. అఫ్గాన్​ బౌలింగ్​ దళం అద్భుతమైన బంతులతో భారత్​ను కట్టడి చేశారు. గత మ్యాచ్​లో ఇంగ్లాండ్​తో ఘోరంగా విఫలమైన రషీద్​ ఖాన్​ సత్తా చాటాడు.

ABOUT THE AUTHOR

...view details