తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​పై ఒకే ఒక్క సిక్సర్​ కొట్టిన భారత్

ప్రపంచకప్​ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా అఫ్గాన్​పై నామమాత్రపు బ్యాటింగ్​ ప్రదర్శన చేసింది. టాప్​ బ్యాట్స్​మెన్లు ఉన్న భారత జట్టు పసికూన అఫ్గాన్​పై ఒకే ఒక్క సిక్సర్​ కొట్టడం గమనార్హం.

పసికూనలపై ఒక్క సిక్స్​ మాత్రమే కొట్టిన టీమిండియా

By

Published : Jun 22, 2019, 10:52 PM IST

సౌతాంప్టన్​ వేదికగా అఫ్గాన్​తో పోరులో టీమిండియా బ్యాటింగ్​లో పేలవ ప్రదర్శన చేసింది. మంచి ఫామ్​లో ఉన్న సారథి కోహ్లీ, ఆల్​రౌండర్​ కేదార్​ జాదవ్​ అర్ధశతకాలతో రాణించినా... పరుగులు చేయడానికి బాగా ఇబ్బందిపడ్డారు. మొదటి బ్యాటింగ్​ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్​లో 15 ఫోర్లు నమోదవగా... ఒకే ఒక్క సిక్సర్​​ రావడం గమనార్హం. భారత బ్యాటింగ్​ సమయంలో 45వ ఓవర్​ అయిదో బంతికి కేదార్​ ఆ ఒక్క సిక్స్​ కొట్టకపోతే మరింత విమర్శలు మూటగట్టుకునేది టీమిండియా.

అంతేకాకుండా 2015 నుంచి ఇప్పటి వరకు మొదటి సారి బ్యాటింగ్​ చేసి.. కోహ్లీ సేన ఇంత తక్కువ స్కోరు చేయడం ఇదే తొలిసారి.

టీమిండియా ఖాతాలో అత్యల్ప స్కోరు

ఈ ప్రపంచకప్​లో టీమిండియా ఇప్పటివరకు స్పిన్​లో వికెట్​ ఇవ్వని రికార్డును అఫ్గాన్​ మ్యాచ్​లో చెరిపేసుకుంది. అఫ్గాన్​ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. పిచ్​ స్పిన్​కు అనుకూలించడాన్ని తెలివిగా ఉపయోగించుకుంది అఫ్గాన్​ జట్టు.

ఇప్పటివరకు స్పిన్​లో ఘనమైన రికార్డు

అఫ్గానిస్థాన్​ బౌలర్లలో అప్తాబ్​ మినహా ఏ ఒక్క బౌలర్​ 6 సగటుకు మించి పరుగులు ఇవ్వలేదు. 10 ఓవర్లు బౌలింగ్​ వేసిన ముజీబ్​ ఒక వికెట్​ సహా అతి తక్కువగా 2.60 సగటుతో మాత్రమే రన్స్​ ఇచ్చాడు. గత మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై 10 ఓవర్లలో 110 పరుగులు సమర్పించుకొన్న రషీద్​.. ఈ మ్యాచ్​లో 10 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి ఓ వికెట్​ తన ఖాతాలో వేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details