తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెలరేగిన భారత ఓపెనర్లు.. లంకపై ఘనవిజయం

భారత్-శ్రీలంక మ్యాచ్​

By

Published : Jul 6, 2019, 2:10 PM IST

Updated : Jul 6, 2019, 10:33 PM IST

2019-07-06 22:29:53

7 వికెట్ల తేడాతో భారత్ విజయం

ప్రపంచకప్​లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లంక 264 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలో దిగిన భారత ఓపెనర్లు విజృంభించారు. రోహిత్(103), రాహుల్(111) శతకాలతో చెలరేగి భారత్​కు విజయాన్ని చేకూర్చారు. లంక బౌలర్లలో మలింగ, ఇసురు ఉడానా, కసున్ రజిత తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

2019-07-06 22:29:47

మూడో వికెట్ కోల్పోయిన భారత్​

ఉడానా వేసిన 42వ ఓవర్​ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు పంత్(4). ప్రస్తుతం భారత్​ గెలవాలంటే  48 బంతుల్లో 12 పరుగులు చేయాలి

2019-07-06 22:20:43

41 ఓవర్లకు భారత్​ స్కోరు 244/2

40వ ఓవర్ వేసిన ఉడానా 4 పరుగులే ఇచ్చాడు. అనంతరం బౌలింగ్ వేసిన మలింగ రెండు ఫోర్లు సహా 10 పరుగులు ఇచ్చి రాహుల్​ను(111) ఔట్ చేశాడు.

2019-07-06 22:20:39

కే ఎల్ రాహుల్ సెంచరీ

ఈ ప్రపంచకప్​లో తొలి శతకం నమోదు చేసాడు రాహుల్​. 109 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి కెరీర్​లో రెండో సెంచరీ చేశాడు. ప్రస్తుతం టీమిండియా 38.2 ఓవర్లకు వికెట నష్టానికి 227 పరుగులు చేసింది.

2019-07-06 22:15:34

34 ఓవర్లకు భారత్​ స్కోరు 207/1

33వ ఓవర్ వేసిన కసున్ రజిత ఓ ఫోర్ సహా 5 పరుగులు ఇచ్చాడు. అనంతరం 34వ ఓవర్లో పెరీరా 2 పరుగులే ఇచ్చాడు. క్రీజులో రాహుల్(90), కోహ్లీ(9) ఉన్నారు.

2019-07-06 22:15:31

32 ఓవర్లకు భారత్​ స్కోరు 196/1

30వ ఓవర్ వేసిన కసున్ రజిత 5 పరుగులు ఇచ్చాడు. అనంతరం 32వ ఓవర్లో పెరీరా 2 పరుగులే ఇచ్చాడు. క్రీజులో రాహుల్(82), కోహ్లీ(6) ఉన్నారు.

2019-07-06 22:04:21

శతకం చేసి ఔటైన రోహిత్​

కసున్ రజిత వేసిన 31వ ఓవర్ తొలి బంతికి రోహిత్(103) ఔటయ్యాడు. క్రీజులో కోహ్లీ(0), రాహుల్(81) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 189/1

2019-07-06 21:54:12

శతకంతో రెచ్చిపోయిన రోహిత్

మరో శతకంతో రెచ్చిపోయాడు రోహిత్. 92 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్​లో 27వ సెంచరీని నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్​లో రోహిత్​కిది ఐదో శతకం. ప్రస్తుతం భారత్​ స్కోరు 183/0

2019-07-06 21:54:06

శతకంతో రెచ్చిపోయిన రోహిత్

మరో శతకంతో రెచ్చిపోయాడు రోహిత్. 92 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్​లో 27వ సెంచరీని నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్​లో రోహిత్​కిది ఐదో శతకం. ప్రస్తుతం భారత్​ స్కోరు 183/0

2019-07-06 21:54:02

శతకం దిశగా రోహిత్

భారత్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ 97 పరుగులతో శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. 28 ఓవర్లకు భారత్​ స్కోరు 177/0

2019-07-06 21:47:27

25 ఓవర్లకు భారత్ స్కోరు 152/0

ఇన్నింగ్స్ సగం ఓవర్లు ముగిసే కల్లా భారత్ 152​ పరుగులు చేసింది. భారత ఓపెనర్లు 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో రోహిత్(81), రాహుల్(69) నిలకడగా ఆడుతున్నారు.

2019-07-06 21:47:15

రాహుల్ అర్ధశతకం

ధనుంజయ వేసిన 23వ ఓవర్లో ఫోర్ కొట్టి అర్ధశతకం చేసిన రాహుల్ అదే ఓవర్లో ఇంకో సిక్సర్​ కొట్టాడు. మొత్తంగా ఆ ఓవర్లో 17 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 137/0

2019-07-06 21:40:20

21 ఓవర్లకు భారత్ స్కోరు 114/0

20 ఓవర్ వేసిన తిసారా పెరీరా ఓ ఫోర్ సహా 6 పరుగులు ఇచ్చాడు. 21వ ఓవర్లో ధనుంజయ ఫోర్ సహా 5 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్(42), రోహిత్(71) క్రీజులో ఉన్నారు.

2019-07-06 21:27:42

19 ఓవర్లకు భారత్​ స్కోరు 103/0

రోహిత్ శర్మ(61), లోకేశ్ రాహుల్(38) వంద పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. 19వ ఓవర్​ మొదటి బంతికి రోహిత్ సింగిల్ తీయడంతో వ100 పరుగులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భారత్ స్కోరు 19వ ఓవర్లకు 103/0

2019-07-06 21:21:51

రోహిత్ అర్ధశతకం

ధనుంజయ డిసిల్వా 17వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్​ కొట్టి అర్ధశతకం సాధించాడు రోహిత్ శర్మ(52). 48 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇదే ఓవర్లో ఇంకో సిక్సర్ కూడా కొట్టాడు. ప్రస్తుతం స్కోరు 95/0

2019-07-06 21:14:53

16 ఓవర్లకు భారత్​ స్కోరు 83/0

15వ ఓవర్ వేసిన ఉడానా కేవలం 2 పరుగులే ఇచ్చాడు. అనంతరం 16వ ఓవర్లో తిసారా పెరీరా 2 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం భారత్ వికెట్ నష్టాపోకుండా 83 పరుగులు చేసింది.

2019-07-06 21:00:24

14 ఓవర్లకు భారత్ స్కోరు 79/0

13వ ఓవర్ వేసిన ఉడానా ఓ ఫోర్​ సహా 6 పరుగులు ఇచ్చాడు. అనంతరం తిసారా పెరీరా వేసిన 14వ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో రాహుల్(34), రోహిత్ శర్మ(44) ఉన్నారు.

2019-07-06 20:51:08

12 ఓవర్లకు భారత్ స్కోరు 71/0

11వ ఓవర్ వేసిన ఉడానా ఓ ఫోర్​ సహా 6 పరుగలు ఇచ్చాడు. అనంతరం తిసారా పెరీరా వేసిన 12వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో రాహుల్(32), రోహిత్ శర్మ(38) ఉన్నారు.

2019-07-06 20:44:12

12 ఓవర్లకు భారత్ స్కోరు 71/0

11వ ఓవర్ వేసిన ఉడానా ఓ ఫోర్​ సహా 6 పరుగలు ఇచ్చాడు. అనంతరం తిసారా పెరీరా వేసిన 12వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో రాహుల్(32), రోహిత్ శర్మ(38) ఉన్నారు.

2019-07-06 20:35:03

12 ఓవర్లకు భారత్ స్కోరు 71/0

11వ ఓవర్ వేసిన ఉడానా ఓ ఫోర్​ సహా 6 పరుగలు ఇచ్చాడు. అనంతరం తిసారా పెరీరా వేసిన 12వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో రాహుల్(32), రోహిత్ శర్మ(38) ఉన్నారు.

2019-07-06 20:23:01

పది ఓవర్లకు భారత్​ స్కోరు 59/0

9వ ఓవర్ వేసిన మలింగ పరుగులేమి ఇవ్వలేదు. అనంతరం 10వ ఓవర్లో కసున్ రజిత 7 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్(27), రోహిత్ (31)ఉన్నారు.

2019-07-06 20:22:56

8 ఓవర్లకు టీమిండియా స్కోరు 52/0

ధాటిగా ఆడుతున్న టీమిండియా 8 ఓవర్లు ముగిసే సరికి 52 పరుగులు చేసింది. రోహిత్ 29, రాహుల్ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

2019-07-06 20:21:13

టీమిండియా ధనాధన్ బ్యాటింగ్

అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 48 పరుగులు చేశారు. క్రీజులో రాహుల్, రోహిత్ శర్మ ఉన్నారు.

2019-07-06 20:14:10

2 ఓవర్లకు భారత్ స్కోరు 14/0

భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. క్రీజులో రాహుల్, రోహిత్ ఉన్నారు. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమి కోల్పోకుండా 14 పరుగులు చేసింది టీమిండియా.

2019-07-06 20:14:07

లీడ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో భారత్​కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది శ్రీలంక. మాథ్యూస్ 113 పరుగులతో ఆకట్టుకున్నాడు. తిరుమన్నే అర్ధసెంచరీ చేశాడు. ఓ దశలో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అద్భుతంగా బ్యాటింగ్​ చేశారు లంక బ్యాట్స్​మెన్.

ప్రారంభంలో కట్టడి చేసి.. ఆ తర్వాత వికెట్లు తీయలేకపోయారు టీమిండియా బౌలర్లు. బుమ్రా 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హార్దిక్, జడేజా, కుల్​దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.

2019-07-06 20:05:25

బుమ్రా బౌలింగ్​లో మ్యాథ్యుస్ ఔట్​

48వ ఓవర్ రెండో బంతికి మ్యాథ్యుస్​ను(113) ఔట్ చేశాడు బుమ్రా. షాట్​కు ప్రయత్నించి రోహిత్​కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం లంక స్కోరు 254/6

2019-07-06 20:05:22

46 ఓవర్లకు శ్రీలంక స్కోరు 239/5

45వ ఓవర్ వేసిన భువనేశ్వర్ ఆరు పరగులు ఇచ్చాడు. అనంతరం పాండ్య వేసిన 46వ ఓవర్లో ఓ ఫోర్​ సహా 7 పరుగులు వచ్చాయి.

2019-07-06 19:57:02

మ్యాథ్యుస్ శతకం

శ్రీలంక బ్యాట్స్​మన్  మ్యాథ్యుస్ శతకంతో ఆకట్టుకున్నాడు. 115 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం లంక 44 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 227 పరుగులు చేసింది.

2019-07-06 19:48:37

43 ఓవర్లకు శ్రీలంక స్కోరు 215/5

42వ ఓవర్ వేసిన పాండ్య ఏడు పరుగులు ఇచ్చాడు. అనంతరం బుమ్రా వేసిన 43వ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. లంక బ్యాట్స్​మన్ మ్యాథ్యూస్(91) శతకానికి చేరువలో ఉన్నాడు.

2019-07-06 19:40:14

41 ఓవర్లకు లంక స్కోరు 205/5

ఆచితూచి ఆడుతున్న లంక ప్రస్తుతం 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రీజులో డిసిల్వా, మాథ్యూస్ ఉన్నారు.

2019-07-06 19:40:06

ఐదో వికెట్​గా వెనుదిరిగిన తిరుమన్నే

53 పరుగులు చేసిన తిరుమన్నే.. కుల్​దీప్ బౌలింగ్​లో ఐదో వికెట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 37.5 ఓవర్లలో 179 పరుగులు చేసింది లంక.

2019-07-06 19:19:41

33 ఓవర్లకు లంక స్కోరు 144/4

నాలుగో వికెట్​ పడిన అనంతరం ఆచితూచి ఆడుతున్న లంక.. 33 ఓవర్లు ముగిసేసరికి 144 పరుగులు చేసింది. మాథ్యూస్ అర్ధశతకం సాధించాడు. తిరుమన్నే 39 పరుగులు చేశాడు.

2019-07-06 18:41:40

29 ఓవర్లకు లంక స్కోరు 122/4

క్రీజులో ఉన్న లంక బ్యాట్స్​మెన్ మాథ్యూస్, తిరుమన్నే ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 29 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

2019-07-06 18:41:38

29 ఓవర్లకు లంక స్కోరు 122/4

క్రీజులో ఉన్న లంక బ్యాట్స్​మెన్ మాథ్యూస్, తిరుమన్నే ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 29 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

2019-07-06 18:31:32

24 ఓవర్లకు శ్రీలంక స్కోరు 100/4

నెమ్మదిగా ఆడుతున్న శ్రీలంక 24 ఓవర్లలో 100 పరుగులు మార్క్​ను అందుకుంది. క్రీజులో మాథ్యూస్, తిరుమన్నే ఉన్నారు.

2019-07-06 18:21:02

జడేజా బౌలింగ్​లో మెండిస్ ఔట్

ఆచితూచి ఆడుతున్న లంక మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ జడేజా బౌలింగ్​లో స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం 10.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది లంక.

2019-07-06 18:10:22

18 ఓవర్లకు శ్రీలంక స్కోరు 75/4

వెంటనే వెంటనే  వికెట్లు కోల్పోయిన లంక.. ఆచితూచి ఆడుతోంది. భారత్​ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. 18 ఓవర్లు ముగిసే సరికి 74 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్, తిరుమన్నే ఉన్నారు.

2019-07-06 18:03:14

జడేజా బౌలింగ్​లో మెండిస్ ఔట్

ఆచితూచి ఆడుతున్న లంక మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ జడేజా బౌలింగ్​లో స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం 10.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది లంక.

2019-07-06 17:54:27

మరో వికెట్ తీసిన బుమ్రా

భారత్ బౌలర్ బుమ్రా.. లంకతో మ్యాచ్​లో మరో వికెట్ తీశాడు. కుశాాల్ పెరీరాను తక్కువ పరుగులకే ఔట్ చేశాడు. ప్రస్తుతం 7.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది లంక. క్రీజులో కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో ఉన్నారు.

2019-07-06 17:40:20

బుమ్రా బౌలింగ్​లో కెప్టెన్ కరుణరత్నే ఔట్

ఆచితూచి ఆడుతున్న శ్రీలంక తొలి వికెట్​ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కరుణరత్నే... బుమ్రా బౌలింగ్​లో కీపర్ క్యాచ్​గా వెనుదిరిగాడు. ఇది వన్డేల్లో బుమ్రాకు 100వ వికెట్.

2019-07-06 17:24:51

2019-07-06 16:52:17

5 ఓవర్లకు లంక స్కోరు 25/0

తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక ఆచితూచి ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి 25 పరుగులు చేసింది.

2019-07-06 16:41:12

బుమ్రా బౌలింగ్​లో కెప్టెన్ కరుణరత్నే ఔట్

ఆచితూచి ఆడుతున్న శ్రీలంక తొలి వికెట్​ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కరుణరత్నే... బుమ్రా బౌలింగ్​లో కీపర్ క్యాచ్​గా వెనుదిరిగాడు. ఇది వన్డేల్లో బుమ్రాకు 100వ వికెట్.

2019-07-06 16:20:21

2019-07-06 16:01:52

2019-07-06 15:52:22

2019-07-06 15:36:21

మూడు ఓవర్లకు లంక స్కోరు 17/0

మూడు  ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమి నష్టపోకుండా 17 పరుగులు చేసింది లంక.

2019-07-06 15:22:55

మూడు ఓవర్లకు లంక స్కోరు 17/0

మూడు  ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమి నష్టపోకుండా 17 పరుగులు చేసింది లంక.

2019-07-06 15:15:06

తొలి ఓవర్​ ముగిసేసరికి లంక 5/0

బ్యాటింగ్ ప్రారంభించింది శ్రీలంక. భువనేశ్వర్ తొలి ఓవర్ వేశాడు. క్రీజులో కరుణరత్నే, కుశాల్ పెరీరా ఉన్నారు. ఓవర్ ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 5 పరుగులు చేసింది.

2019-07-06 15:12:44

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న శ్రీలంక

లీడ్స్​లో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్​ బౌలింగ్​ దాడిని ఆరంభించనుంది.

మార్పులు:లంక జట్టులోకి తిశారా పెరీరా వచ్చాడు. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. చాహల్ స్థానంలో కుల్​దీప్, షమి స్థానంలో జడేజా మైదానంలో కనిపించనున్నారు.

జట్లు వివరాలు:

టీమిండియా:రాహుల్, రోహిత్, కోహ్లీ(కెప్టెన్), దినేశ్ కార్తిక్, పంత్, ధోని, జడేజా, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, కుల్​దీప్, బుమ్రా

శ్రీలంక:కరుణరత్నే(కెప్టెన్), కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, తిశారా పెరీరా, తిరుమన్నే, మాథ్యూస్, ధనుంజయ డిసిల్వా, ఉదానా, రజితా, మలింగ

2019-07-06 15:01:39

ప్రపంచకప్​లో టీమిండియా చివరి లీగ్​ మ్యాచ్​

ప్రపంచకప్​లో లీగ్​ దశలో చివరి మ్యాచ్​లకు సిద్ధమైంది. టీమిండియా తన చివరి లీగ్​ మ్యాచ్ శ్రీలంకతో ఆడనుంది. హెడ్డింగ్లే వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు జట్లు విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.  గత మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై భారత్, వెస్టిండీస్​పై శ్రీలంక గెలుపొందాయి.

అగ్రస్థానానికి అవకాశం..

ఈ రోజు సాయంత్రం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయి... శ్రీలంకపై భారత్‌ గెలిస్తే కోహ్లీ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి న్యూజిలాండ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో మాత్రమే ఓటమిపాలైన టీమిండియా... సెమీస్​లో ఆ జట్టును ఎదుర్కోదు

2019-07-06 14:35:07

2019-07-06 13:57:06

Last Updated : Jul 6, 2019, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details