తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరుణుడు ప్రతాపం.. టీమిండియా మ్యాచ్​ రద్దు - పోరు

కివీస్​తో భారత్​ ఢీ...

By

Published : Jun 13, 2019, 2:44 PM IST

Updated : Jun 13, 2019, 7:41 PM IST

2019-06-13 19:35:39

వర్షం ధాటికి మరో ప్రపంచకప్​ మ్యాచ్​ రద్దు​

ఆగకుండా కురిసిన వర్షం టీమిండియాను ఈ రోజు మ్యాచ్​ ఆడకుండా చేసింది. కివీస్​తో రసవత్తరంగా సాగుతుందనుకున్న ఈ పోరు.. వరుణుడి ధాటికి టాస్ పడుకుండానే రద్దయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుత ప్రపంచకప్​లో వర్షం కారణంగా మ్యాచ్​ రద్దు కావడం ఇప్పటికే ఇది నాలుగవసారి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం న్యూజిలాండ్​ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఐదు పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో ఉంది. 

2019-06-13 19:11:26

మ్యాచ్​ ప్రారంభిస్తారా.. రద్దు చేస్తారా..!

నాటింగ్​హామ్ వేదికగా జరగాల్సిన భారత్- న్యూజిలాండ్​ మ్యాచ్​ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పటికప్పుడు పిచ్​ను​ పరిశీలిస్తున్న అంపైర్లు మ్యాచ్​ను కొనసాగించే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం పిచ్​ను పూర్తిగా కప్పి ఉంచారు. ఇంకా టాస్​ వేయని ఈ మ్యాచ్​ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

2019-06-13 16:26:58

వర్షంతో ఇంకా ప్రారంభం కాని భారత్- న్యూజిలాండ్ మ్యాచ్​

టీమిండియా- న్యూజిలాండ్​ రసవత్తర ప్రపంచకప్​ పోరుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. మైదానంలో ఆగకుండా వర్షం కురుస్తోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30  నిమిషాలకు మ్యాచ్​కు సంబంధించిన సమాచారాన్ని తెలపనున్నారు అంపైర్లు. మ్యాచ్​ ఓవర్లను కుదించే అవకాశం ఉంది.​ 

2019-06-13 15:10:35

పిచ్​ పరిశీలన..

మధ్యాహ్నం 3.30కు మరోసారి పిచ్​ను పరిశీలించనున్న అంపైర్లు.

2019-06-13 14:33:12

కివీస్​తో భారత్​ ఢీ...

నాటింగ్​హామ్ వేదికగా నేడు భారత్​ - న్యూజిలాండ్​తో తలపడనుంది. మ్యాచ్​కు వర్షం అడ్డంకిగా మారింది. సోమవారం నుంచి విస్తారంగా వర్షం కురుస్తోంది. టీమిండియా నెట్​ ప్రాక్టీస్​కు కూడా పిచ్ అనుకూలించలేదు. వాన కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. పిచ్​ పరిస్థితి బావున్నప్పటికీ ఔట్​ ఫీల్డ్​ తడిగా ఉంది. కాసేపట్లో మ్యాచ్​పై అంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు. మ్యాచ్​ ఓవర్లను కుదించే అవకాశం ఉంది.

Last Updated : Jun 13, 2019, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details