ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఉపయోగించిన బంతి రూ.లక్ష 50 వేలకు అమ్ముడుపోయింది. ఇంగ్లాండ్ కరెన్సీ ప్రకారం 2150 డాలర్లకు అమ్మారు. టాస్ కాయిన్‌ను 1450 డాలర్లకు, స్కోరుషీట్ను 1100 డాలర్లకు విక్రయించారు.
డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇదే మ్యాచ్.. భారత్ సెమీస్ చేరేందుకు, లీగ్ దశ నుంచి పాక్ నిష్క్రమణకు కారణమైంది. ఆ తర్వాత సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడింది కోహ్లీసేన.