తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: సెమీస్ చేరిన భారత్​.. బంగ్లాపై ఉత్కంఠ విజయం - KOHLI

భారత్- బంగ్లాదేశ్​ మ్యాచ్​

By

Published : Jul 2, 2019, 2:23 PM IST

Updated : Jul 2, 2019, 11:07 PM IST

2019-07-02 23:06:02

భారత్​ 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం

ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్​ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బర్మింగ్​హామ్ వేదికగా జరిగిన ఈ పోరులో నెగ్గి టీమిండియా వరల్డ్​కప్​ సెమీస్​కు చేరుకుంది. 315 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్ పరుగులకు 286 ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్​మెన్​లో షకిబ్(66), సైఫుద్దీన్(51*) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. మిగతా వారు ఓ మోస్తరుగా ఆడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా పాండ్య 3.. భువి, చాహల్, షమీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

చివర్లో సైఫుద్దీన్ బంగ్లాకు విజయాన్ని చేరువ చేశాడు. వరుసగా ఫోర్లతో ఎదురుదాడికి భారత్​ అభిమానుల్లో గుబులురేపాడు.

2019-07-02 23:04:18

2019-07-02 22:59:50

బుమ్రా బౌలింగ్​లో రుబెల్ ఔట్

48వ ఓవర్ చివరి బంతికి రుబెల్​ను బౌల్డ్ చేశాడు బుమ్రా. బంగ్లా గెలవాలంటే 13 బంతుల్లో 29 పరుగులు చేయాలి.

2019-07-02 22:55:12

47 ఓవర్లకు బంగ్లా స్కోరు 279/9

46వ ఓవర్లో బుమ్రా ఫోర్ సహా 8 పరుగులు ఇచ్చాడు. అనంతరం షమీ 47వ ఓవర్లో 7 పరుగులు ఇచ్చాడు. బంగ్లా గెలవాలంటే 18 బంతుల్లో 36 పరుగులు చేయాలి. 

2019-07-02 22:41:58

భువి బౌలింగ్​లో మోర్తాజా ఔట్​

45వ ఓవర్ రెండో బంతికి బంగ్లా కెప్టెన్ మోర్తాజా(8) ఔట్​ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లా గెలవాలంటే 34 బంతుల్లో 55 పరుగులు చేయాలి.

2019-07-02 22:34:46

బుమ్రా బౌలింగ్​లో సబ్బీర్ ఔట్

44వ ఓవర్ తొలి బంతికి సబ్బీర్ రెహమాన్​ను ఔట్ చేశాడు బుమ్రా. ప్రస్తుతం క్రీజులో సైఫుద్దీన్(30), మోర్తాజా(0) ఉన్నారు. బంగ్లా స్కోరు 245/7

2019-07-02 22:27:19

42 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 240/6

41వ ఓవర్ వేసిన చాహల్ 4 పరుగులే ఇచ్చాడు. అనంతరం 42వ ఓవర్లో షమీ 2 ఫోర్లు 11 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో సైఫుద్దీన్(29), సబ్బీర్ రెహమాన్(34) ఉన్నారు.
 
2019-07-02 22:19:18

38 ఓవర్లకు బంగ్లా స్కోరు 208/6

37వ ఓవర్ వేసిన చాహల్ ఒక్క పరుగులే ఇచ్చాడు. అనంతరం షమీ వేసిన 38వ ఓవర్లో 4 ఫోర్లు సహా 17 పరుగులు వచ్చాయి. క్రీజులో సబ్బీర్ రెహమాన్(24), సైఫుద్దీన్(9) ఉన్నారు.
 
2019-07-02 22:11:12

36 ఓవర్లకు బంగ్లా స్కోరు 190/6

35వ ఓవర్ వేసిన బుమ్రా మూడు పరుగులే ఇచ్చాడు. అనంతరం పాండ్య వేసిన 36వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో సబ్బీర్ రెహమాన్(14), సైఫుద్దీన్(1) ఉన్నారు.

2019-07-02 22:01:11

పాండ్య బౌలింగ్​లో షకిబ్ ఔట్​

34వ ఓవర్ ఐదో బంతికి షకిబ్​ను ఔట్ చేశాడు పాండ్య. లెగ్ సైడ్ ఆడిన షకిబుల్ హసన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 179/6

2019-07-02 21:49:53

25 ఓవర్లకు బంగ్లా స్కోరు 127/3

షమీ వేసిన 24వ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. అనంతరం 25వ ఓవర్ వేసిన చాహల్ 2 పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో షకిబ్(42), లిటన్ దాస్(3) ఉన్నారు.

2019-07-02 21:05:45

చాహల్ బౌలింగ్​లో ముష్ఫీకర్ ఔట్​

23వ ఓవర్ చివరి బంతికి బంగ్లా బ్యాట్స్​మన్ ముష్ఫీకర్(24) చాహల్ బౌలింగ్ ఔట్ అయ్యాడు. షాట్​కు ప్రయత్నించి షమీకి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 121/3.

2019-07-02 20:55:28

22 ఓవర్లకు బంగ్లా స్కోరు 116/2

చాహల్ వేసిన 21వ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. అనంతరం 22వ ఓవర్లో పాండ్య ఓ ఫోర్ సహా 9 పరుగులు ఇచ్చాడు. 

2019-07-02 20:52:33

20 ఓవర్లకు బంగ్లా స్కోరు 104/2

19వ ఓవర్ వేసిన చాహల్ రెండు ఫోర్లు సహా 10 పరుగులు ఇచ్చాడు. అనంతరం పాండ్య వేసిన 20వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో షకిబ్(29), ముష్ఫీకర్(17) ఉన్నారు. 

2019-07-02 20:45:12

18 ఓవర్లకు బంగ్లా స్కోరు 88/2

17వ ఓవర్ వేసిన చాహల్ 4 పరుగులిచ్చాడు. అనంతరం పాండ్య వేసిన 18వ ఓవర్లో ఓ ఫోర్ సహా 9 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో షకిబ్(24), ముష్ఫీకర్ రహీమ్(5) ఉన్నారు.

2019-07-02 20:36:20

పాండ్య బౌలింగ్​లో సౌమ్యా సర్కార్ ఔట్​

16వ ఓవర్ మొదటి బంతికే సౌమ్యా సర్కార్​ను(33) ఔట్ చేశాడు పాండ్య. 15.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసిన బంగ్లాదేశ్

2019-07-02 20:25:18

14 ఓవర్లకు బంగ్లా స్కోరు 69/1

13వ ఓవర్ వేసిన చాహల్ ఓ ఫోర్ సహా ఆరు పరుగులిచ్చాడు. అనంతరం షమీ 14వ ఓవర్లో రెండు ఫోర్లు సహా పది పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో సౌమ్యా సర్కార్(31), షకిబ్(14) క్రీజులో ఉన్నారు. 

2019-07-02 20:21:35

రివ్యూ కోల్పోయిన టీమిండియా

షమీ వేసిన 12వ ఓవర్ రెండో బంతి సౌమ్యా సర్కార్ ప్యాడ్లను తాకింది. అయితే అంపైర్ నాటౌట్​గా ప్రకటించడంతో భారత్ రివ్యూ కోరింది. రివ్యూలో బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్​గా తేలడంతో టీమిండియా సమీక్ష కోల్పోయింది. అయితే ఇన్​సైడ్​ ఎడ్జ్ స్పష్టంగా తేలలేదు. దీనిపై కోహ్లీ అసంతృప్తి చెందాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 53/1

2019-07-02 20:14:19

నిదానంగా ఆడుతున్న బంగ్లా బ్యాట్స్​మెన్

బర్మింగ్​హామ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో బంగ్లా ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నాడు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్లు పోకుండా 34 పరుగులు చేశారు. క్రీజులో తమీమ్, సౌమ్య సర్కార్ ఉన్నారు.

2019-07-02 19:58:11

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్

315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్​..  2 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో తమీమ్, సౌమ్య సర్కార్ ఉన్నారు.

2019-07-02 19:47:11

రోహిత్ మెరిసినా.. భారీ స్కోరు చేయని భారత్​

భారీ స్కోరు చేస్తుందనకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 104, రాహుల్ 77, పంత్ 48 మినహా మిగతా వారందరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ప్రారంభంలో వికెట్లు తీయలేకపోయినా బంగ్లా బౌలర్లు చివర్లో భారత్ బ్యాట్స్​మెన్​ను పరుగులు చేయకుండా నియంత్రించారు.

బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హాసన్, రుబెల్ హుస్సేన్, సౌమ్య సర్కార్ తలో వికెట్ దక్కించుకున్నారు.

2019-07-02 19:24:14

దినేశ్ కార్తిక్ పెవిలియన్​కు..

నిలకడగా ఆడుతున్న టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన దినేశ్ కార్తిక్ ముస్తాఫిజుర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం 48 ఓవర్​లలో 300 పరుగులు మార్క్​ను అందుకుంది.

2019-07-02 18:41:05

42 ఓవర్లకు భారత్ స్కోరు 265/4

41వ ఓవర్ వేసిన షకిబ్ 4 పరుగులే ఇచ్చాడు. అనంతరం 42వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ ఓ ఫోర్ సహా 10 పరుగులు సమర్పించుకున్నాడు. 

2019-07-02 18:32:56

40 ఓవర్లకు భారత్ స్కోరు 251/4

39వ ఓవర్లో రెండు వికెట్లు సహా మెయిడిన్​ చేశాడు ముస్తాఫిజుర్. అనంతరం సైఫూద్దీన్ వేసిన 40వ ఓవర్లో పంత్ 3 ఫోర్లు కొట్టాడు. మొత్తం ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో పంత్(36), ధోనీ(1) ఉన్నారు. 

2019-07-02 18:18:16

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్

39వ ఓవర్ రెండో బంతికి కోహ్లీని ఔట్ చేసిన ముస్తాఫిజుర్ నాలుగో బంతికి పాండ్యను ఔట్ చేశాడు. స్లిప్​లో సౌమ్యా సర్కార్​కు క్యాచ్ ఇచ్చి డకౌట్​గా వెనుదిరిగాడు పాండ్య. 

2019-07-02 18:08:14

ముస్తాఫిజర్ బౌలింగ్​లో కోహ్లీ ఔట్

39వ ఓవర్ వేసిన ముస్తాఫిజర్ రెహమాన్ రెండో బంతికే కోహ్లీని(26) చేశాడు. షాట్​కు ప్రయత్నించిన విరాట ్ బౌండరీ లైన్​లో రుబెల్​కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో పాండ్య, పంత్(23) ఉన్నారు.

2019-07-02 17:56:07

38 ఓవర్లకు భారత్ స్కోరు 237/2

37వ ఓవర్ వేసిన షకిబు రెండు ఫోర్లు సహా 10 పరుగులిచ్చాడు. సౌమ్యా సర్కార్ వేసిన 38వ ఓవర్లో  ఓ ఫోర్ సహా 10 పరుగులు వచ్చాయి. క్రీజులో పంత్(23), కోహ్లీ(26) ఉన్నారు. స్కోరు 237/3.

2019-07-02 17:51:05

36 ఓవర్లకు టీమిండియా స్కోరు 217/2

నెమ్మదిగా బ్యాటింగ్​ చేస్తున్న టీమిండియా.. 36 ఓవర్లకు 217 పరుగులు చేసింది. క్రీజులో పంత్, కోహ్లీ క్రీజులో ఉన్నారు.

2019-07-02 17:48:18

రాహుల్ ఔటయ్యాడు..

దూకుడుగా ఆడుతున్న టీమిండియా రెండో వికెట్​ కోల్పోయింది. 77 పరుగులు చేసిన రాహుల్.. రుబెల్ హుస్సేన్ బౌలింగ్​ల ో ఔటయ్యాడు. ప్రస్తుతం 33 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

2019-07-02 17:45:50

హిట్ మ్యాన్​ రోహిత్ పెవిలియన్​కు..

అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ..104 పరుగులు చేసి సౌమ్య సర్కార్ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్​కు 180 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచకప్​లో టీమిండియాకు ఇదే అత్యుత్తమం 

2019-07-02 17:18:41

సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ

90 బంతుల్లో సెంచరీ చేశాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. ప్రస్తుతం 29 ఓవర్లకు 176 పరుగులు చేసింది టీమిండియా.

2019-07-02 17:17:56

సెంచరీకి చేరువలో రోహిత్ శర్మ

దూకుడుగా ఆడుతున్న టీమిండియా 24 ఓవర్లకు వికెట్లేమి నష్టపోకుండా 158 పరుగులు చేసింది. రోహిత్ శర్మ శతకానికి చేరువలో ఉన్నాడు. రాహుల్ 63 పరుగులు చేశాడు.

2019-07-02 17:03:21

వంద కొట్టిన టీమిండియా ఓపెనర్లు

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో నెమ్మదిగా ఆడిన టీమిండియా ఓపెనర్లు తొలి వికెట్​కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 18 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 105 పరుగులు చేశారు. రోహిత్ 57, రాహుల్ 48 పరుగులు చేశాడు.

2019-07-02 16:54:33

14 ఓవర్లకు టీమిండియా స్కోరు 79/0

నిలకడగా ఆడుతున్న టీమిండియా 14 ఓవర్లకు వికెట్లేమి నష్టపోకుండా 78 పరుగులు చేసింది. రోహిత్ శర్మ అర్ధసెంచరీకి చేరువలో ఉన్నాడు.

2019-07-02 16:42:43

నెమ్మదిగా టీమిండియా బ్యాటింగ్

ఆచితూచి ఆడుతున్న టీమిండియా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. 9 ఓవర్లు ముగిసే 59 పరుగులు చేసింది. రోహిత్ 33, రాహుల్ 23 పరుగులు చేశారు.

2019-07-02 16:17:24

టీమిండియా స్కోరు 6 ఓవర్లకు 30/0

నిలకడగా ఆడుతున్న కోహ్లీసేన 6 ఓవర్లు ముగిసే సరికి  30 పరుగులు చేసింది. రాహుల్ 10, రోహిత్ శర్మ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-07-02 15:55:42

నెమ్మదిగా.. కాస్త నిలకడగా

బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమిండియా బ్యాటింగ్​ ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసే సరికి 14 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్, రోహిత్ శర్మ ఉన్నారు.

2019-07-02 15:39:25

మొదటి బ్యాటింగ్ భారత్​దే

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. పరుగులు వరదే పారే అవకాశమున్న ఈ మైదానంలో టీమిండియా బ్యాట్స్​మెన్ ఎలా చెలరేగుతారో చూడాలి. 

ఈ రోజు భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. కుల్​దీప్, జాదవ్​కు విశ్రాంతినిచ్చి దినేశ్ కార్తీక్, భువనేశ్వర్​లకు అవకాశం కల్పించింది.

జట్లు

టీమిండియా:రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్, ధోని, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, చాహల్, భువనేశ్వర్, షమి, బుమ్రా

బంగ్లాదేశ్:తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హాసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, మొసాద్దిక్ హుస్సేన్, షబ్బీర్ రెహ్మాన్, సైఫుద్దీన్, మొర్తజా, రుబెల్ హుస్సేన్, ముష్తాఫిజుర్ రెహ్మాన్

2019-07-02 15:22:53

ఉపఖండ జట్ల మధ్య పోరు.. గెలిచేది ఎవరు..?

బర్మింగ్​హామ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్​ ప్రారంభం కానుంది.  గత మ్యాచ్​లో ఇంగ్లండ్​పైనా ఓడిన కోహ్లీసేన.. ఇప్పుడు గెలిచి సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తోంది. బంగ్లా జట్టు ఈ పోరులో విజయం సాధించాలని భావిస్తోంది. మరి మ్యాచ్​ ఎవరి సొంతమవుతుందో చూడాలి. 

ఈ ప్రపంచకప్​లో ఇదే పిచ్​పై ఇంగ్లాండ్​ చేతిలో ఓడింది టీమిండియా. ఈ మైదానంలో పరుగులు వరద పారే అవకాశముంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలిచే అవకాశం ఎక్కువ. వర్ష సూచన లేదు.

2019-07-02 15:12:48

2019-07-02 14:34:26

2019-07-02 14:03:09

Last Updated : Jul 2, 2019, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details