భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోన్న ఈ మ్యాచ్‌లో రాణించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు పాక్ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
'పాక్ ఆటగాళ్లూ... చివరి బంతి వరకు పోరాడండి'
ప్రపంచకప్‌లో భారత్Xపాక్ రసవత్తర పోరు మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చేలా వరుస ట్వీట్లు చేశారు.
" ఈరోజు ఆటలో విజేతను నిర్ణయించేది నైపుణ్యం ఒక్కటే కాదు మానసిక ధృడత్వం. సమయానికి తీసుకునే నిర్ణయాలు. సర్ఫరాజ్ అధ్యక్షతన పాక్ జట్టు విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. పాక్ ఆటగాళ్లు వారి మనసుల్లోంచి ఓటమి భయాన్ని తొలగించాలి. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే పాక్ ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుంది.టైటిల్ ఫేవరెట్లలో భారత్ ఒకటైనా... ఓటమి అనే భయాన్ని వీడి చివరి బంతి వరకు పోరాడండి. చివరకు ఎలాంటి ఫలితమైనా నిజమైన క్రీడాకారుడిగా స్వీకరించండి. దేశం మొత్తం మీకోసం ప్రార్థిస్తోంది.. గుడ్ లక్"
--ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధాని