తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: పాక్​తో మ్యాచ్​- 12 రాత్రులు నిద్రపోని సచిన్​ - సారథులు దాదా, వకార్​ యూనిస్​

భారత్​-పాక్​ మధ్య క్రికెట్​ అంటే ఓ యుద్ధంలా చూస్తారు ఇరుదేశాల క్రికెట్​ అభిమానులు. మరి అలాంటి ఆట​లో కచ్చితంగా గెలవాలన్న కసి సచిన్​ను 12 రాత్రులు నిద్రపోకుండా చేసింది. అంతేకాదు ఆ మ్యాచ్​లో పంటి బిగువున నొప్పిని భరిస్తూ... మాస్టర్ ఆడిన​ ఇన్నింగ్స్​ భారత్​కు ఓ చారిత్రక విజయాన్ని అందించింది.

WC19: పాక్​తో మ్యాచ్​... 12 రాత్రులు నిద్రపోని సచిన్​

By

Published : May 17, 2019, 5:27 AM IST

Updated : May 17, 2019, 11:14 AM IST

2003 మార్చి 1... భారత్​-పాక్​ మధ్య ప్రపంచకప్​​ 36వ మ్యాచ్​. గెలిచిన జట్టు సెమీఫైనల్​ చేరుతుంది. నాలుగోసారి ప్రపంచకప్​లో తాడోపేడో తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. అప్పటివరకు భారత్​ ఒక్కసారి పాక్​పై ఓడిపోలేదు. ఆ రికార్డు నిలబెట్టడానికి సచిన్​ పడిన కష్టం అంతా ఇంతా కాదు.

సెంచూరియన్​ మైదానంలో వకార్​ యూనిస్​ నేతృత్వంలోని పాక్​ జట్టు, దాదా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది. టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ ఎంచుకున్నాడు యూనిస్​. పాక్​ ఆటగాడు సయీద్​ అన్వర్​(101) పరుగులు చేయటం వల్ల 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది దాయాది దేశం.

భారత్-పాక్​ మ్యాచ్​లో సారథులు దాదా , వకార్​ యూనిస్

ఈ స్కోరు ఛేదించడం టీమిండియాకు అంత సులువేం కాదు. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్​బౌలర్ల జాబితాలోని షోయబ్​ అక్తర్​, వసీమ్​ అక్రమ్​, వకార్​లతో పాక్​ పేస్​ లైనప్​ పటిష్ఠంగా ఉంది.

తడబడితే మాస్టర్​ నిలబెట్టాడు...

ఓపెనర్​గా బరిలోకి దిగిన సెహ్వాగ్​ మూడు బౌండరీలతో మంచి ఆరంభమిచ్చినా... 14 బంతుల్లో 21 పరుగుల తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సౌరవ్​ గంగూలీ మరుసటి బంతికే డకౌట్​గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సచిన్ అవతలి ఎండ్​లో ​ఉండి ఆడుతున్నాడు. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన భారత్​కు మొహమ్మద్​ కైఫ్​తో కలిసి చక్కటి ఇన్నింగ్స్​ అందించాడు మాస్టర్​ బ్లాస్టర్​​. కైఫ్​ 60 బంతుల్లో 35 పరుగులతో మంచి సహకారం అందించినా... త్వరగా ఔటయ్యాడు.

సచిన్​ తెందూల్కర్​ 75 బంతుల్లో 98 పరుగులతో కీలక ఇన్నింగ్స్​ ఆడి భారత్​ను గట్టెక్కించాడు. ఈ మ్యాచ్​లోనే సచిన్​ వన్డేల్లో 12వేల మైలురాయిని అందుకున్నాడు. కాని చివరకు అక్తర్ గంటకు​ 147 కి.మీ వేగంతో వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో సెంచరీ సాధించకుండానే పెవిలియన్​ చేరాడు మాస్టర్​.

నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న భారత్​ను యువీ అర్థశతకం , ద్రవిడ్​ 44 పరుగులు చేసి ముందుకు నడిపించారు. ఫలితంగా మరోసారి పాక్​పై చారిత్రక విజయం టీమిండియా సొంతమైంది. 45.4 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేదించింది భారత జట్టు. ఆరువికెట్ల తేడాతో గెలుపొందింది.

తొలిసారి సచిన్​కు బైరన్నర్​...

ఎన్నో మ్యాచ్​లు ఆడిన సచిన్​ తన కెరీర్​లో తొలిసారి ఈ మ్యాచ్​లోనే బైరన్నర్​ను ఉపయోగించుకున్నాడు. తొడ కండరాలు పట్టేయడం మూలంగా పరిగెత్తడానికి ఇబ్బంది పడిన మాస్టర్... సెహ్వాగ్​ సహాయం తీసుకున్నాడు.

సచిన్​కు బైరన్నర్​గా సెహ్వాగ్​

ఇవీచూడండి--> WC19: అత్యధిక పరుగుల వీరులు వీరే

Last Updated : May 17, 2019, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details