తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: మీ క్రికెట్​ విన్యాసాలకు నయా ఛాలెంజ్​! - #criiio

ప్రపంచకప్​ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్​ మండలి​(ఐసీసీ) క్రియో పేరిట క్యాంపెయిన్​ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​కు ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది.

క్రియో క్యాంపెయిన్​ ప్రారంభించిన ఐసీసీ

By

Published : May 29, 2019, 1:23 PM IST

పురుషుల ప్రపంచకప్​ నేపథ్యంలో ఐసీసీ బుధవారం క్రియో ఛాలెంజ్​ ప్రారంభించింది. ఇందులో భాగంగా అభిమానులంతా సోషల్​మీడియాలో క్రికెట్​ ఆడుతున్న ఫొటోలు పంచుకోవాలని కోరింది. ఈ పోస్టులకు #criiio హ్యాష్​ ట్యాగ్​ జత చేయాలని సూచించింది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 46 కోట్ల మంది క్రికెట్ అభిమానులున్నారు. అందరినీ ఒక చోట చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన క్యాంపెయిన్​ ప్రారంభించింది ఐసీసీ.

క్రియో క్యాంపెయిన్​లో ఓ అభిమాని ట్యాగ్​ చేసిన చిత్రం

" ఐసీసీ పురుషుల ప్రపంచకప్​ సందర్భంగా పది జట్లు, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం. క్రియో అనేది ఓ పండగ లాంటిది. సోషల్​మీడియా ద్వారా అర బిలియన్​కుపైగా అభిమానులు మాతో కలిసి ఈ ఆనందంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఈ క్యాంపెయిన్​లోకి ఆహ్వానిస్తున్నాం. క్రికెట్​ అనేది అందరిది. కలిసికట్టుగా ఉంచుతుంది. అంతేకాకుండా ఖర్చు తక్కువ. సులభంగా, సరదాగా ఉండే ఆట. ఈ కార్యక్రమం ద్వారా ఎన్ని విధాలుగా ప్రజలు ఆట ఆడుతున్నారో అందరితో​ పంచుకుంటాం".
--మను సాహ్నే, ఐసీసీ ప్రధానాధికారి

గతంలో 'వరల్డ్​ వైడ్​ వికెట్స్'​ పేరిట ఐసీసీ నిర్వహించిన క్యాంపెయిన్​కు మంచి స్పందన లభించింది. కొంతమంది సముద్రం ఒడ్డున, మరికొంత మంది పెరడులో ఇలా రకరకాల ప్రదేశాల్లో క్రికెట్​ ఆడినవి ఈ హ్యాష్​ట్యాగ్​తో పంచుకుంటున్నారు.

వరల్డ్​ వైడ్​ వికెట్స్​ క్యాంపెయిన్​లో కొన్ని చిత్రాలు

మే 30న ప్రపంచకప్​ టోర్నీ తొలి మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details