వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ప్రపంచకప్ సెమీస్, ఫైనల్లలో సత్తా చాటిన ఆటగాళ్లు తమ ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. భారత స్టార్ క్రికెటర్లు విరాట్, రోహిత్ తమ స్థానాలను పదిల పరుచుకున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీ 886 పాయింట్లతో తొలి స్థానంలో, 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.
జడేజా వేగం..
సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. అదే మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించినంత పనిచేసిన రవీంద్ర జడేజా ఏకంగా 24 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం జడేజా 108వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై 85 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లాండ్ ఆటగాడు రాయ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. 774 పాయింట్లతో అతను 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫైనల్లో జట్టుని విజయతీరాలకు చేర్చిన బెన్‌స్టోక్స్ 694 పాయింట్లతో టాప్ 20లో స్థానం దక్కించుకున్నాడు.
బుమ్రా టాప్...