తానైతేభారత జట్టులో రిషభ్‌పంత్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేస్తానని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ పరిస్థితులపై పంత్‌కు ఉన్న అవగాహనే ఇందుకు కారణమని తెలిపాడు.
"‘జట్టు యాజమాన్యంలో నా జోక్యం ఉంటే నాలుగో స్థానానికి రిషభ్‌పంత్‌ను పరిశీలిస్తా. ధావన్ గాయం కారణంగా వైదొలగటం వల్ల పంత్‌ను పిలిపించారు. ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. గత వేసవిలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పంత్ ఆకట్టుకున్నాడు. ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసు. టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. అతడి ప్రపంచకప్ అరంగేట్రానికి ఇదే మంచి తరుణం. మిడిలార్డర్లో విజయ్ శంకర్, కేదార్ జాదవ్ ఇంకా ఆకట్టుకోలేదు. వారి ఆటలో మార్పు అవసరం."
-కృష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా మాజీ క్రికెటర్