తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్ సారథి.. గోళ్లు తీసుకోవడంలో బిజీ - cricket

శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ సారథి హోల్డర్​ మైదానం వీడి గోళ్లు తీసుకున్నాడు. ఈ వీడియో వైరల్​గా మారింది.​

హోల్డర్

By

Published : Jul 2, 2019, 12:24 PM IST

వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్​లో విండీస్ సారథి హోల్డర్​ కాసేపు మైదానాన్ని వీడాడు. అందులో వింతేముందంటారా..? అందుకు గాయమో, అత్యవసర కాలకృత్యాలు తీర్చుకోవడమో కారణం కాదు. గోళ్లు తీసుకోవడానికి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

శ్రీలంక బ్యాటింగ్ జరుగుతోన్న సమయంలో హోల్డర్​ కాసేపు మైదానాన్ని వీడాడు. కాలి, చేతి వేళ్లకు గోళ్లు తీసుకుంటూ కెమెరాలకు చిక్కాడు. గోళ్లు తీసుకోవడానికి కనీసం సమయం లేనంత బిజీగా ఉన్నాడని ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు.

గోళ్లు తీసుకుంటోన్న హోల్డర్
ఈ మ్యాచ్​లో విండీస్​పై లంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవీ చూడండి.. రాయుడు త్రీడీ కౌంటర్​ బెడిసి కొట్టిందా?

ABOUT THE AUTHOR

...view details