తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: బెట్టింగ్​ రాయుళ్ల చూపు భారత్​వైపే - రోహిత్ శర్మ

ప్రపంచకప్​ను​ మూడోసారి భారత్ సొంతం చేసుకుంటుందని లండన్ వేదికగా ఉన్న బెట్టింగ్ వెబ్​సైట్లు ఊహిస్తున్నాయి. పందెం గణాంకాల ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడిస్తున్నాయి.

భారత్​ గెలుస్తుందని విస్తృతంగా బెట్టింగ్​లు

By

Published : Jul 9, 2019, 9:30 AM IST

Updated : Jul 9, 2019, 9:48 AM IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ప్రపంచకప్​ టోర్నీ సెమీస్​కు చేరింది. ఈ నేపథ్యంలో విశ్వ విజేత ఎవరనేదానిపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. అంతే కాదు సెమీస్ జట్లపై, తుదిపోరులో గెలిచే టీమ్​పై పందేలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే లండన్​ వేదికగా ఉన్న బెట్టింగ్ వెబ్​సైట్లలో భారత్​కు అనుకూలంగా పందేలు నడుస్తున్నాయి.

జులై 14న జరగబోయే తుదిపోరుకు భారత్ చేరుకుంటుందని లండన్​కు చెందిన ల్యాడ్​బ్రోక్స్, బెట్​వే​ లాంటి బెట్టింగ్ వెబ్​సైట్లు చెబుతున్నాయి. అంతేకాదు టీమిండియా వరల్డ్​కప్​ సొంతం చేసుకుంటుందని బెట్టింగ్ కడుతున్నారు పందెం రాయుళ్లు.

బెట్టింగ్ వెబ్​సైట్

బెట్టింగ్​ సంస్థలు భారత్​కు అనుకూలంగా 13/8 రేటింగ్ ఇచ్చాయి. తరువాతి స్థానాల్లో ఇంగ్లాండ్​ (15/8), ఆస్ట్రేలియా (11/4), న్యూజిలాండ్​ (8/1) ఉన్నాయి.

పందెంలో డబ్బులు ఇలా వస్తాయి..

తుదిపోరులో భారత్ గెలుస్తుందని టీమిండియా తరపున 13:8 నిష్పత్తిలో బెట్టింగ్ చేస్తున్నారు. ఉదాహరణకు వంద రూపాయలు బెట్టింగ్ చేస్తే.. ఆ వందను 13తో గుణించి 8తో భాగించాలి. వచ్చిన ఫలితమే గెలిచిన వారికి దక్కుతుంది.

బెట్టింగ్​

బెట్ వే వెబ్​సైట్​లోనూ భారత్ టాప్​..

మూడోసారి భారత్​ ప్రపంచకప్​ను సొంతం చేసుకుంటుందని బెట్​ వై వెబ్​సైటూ తెలిపింది. బెట్టింగ్​ల ఆధారంగా గణించగా.. 2.8 పాయింట్లతో భారత్​ తొలి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ (3), ఆస్ట్రేలియా (3.8), న్యూజిలాండ్ ​(9.5) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఈ ప్రపంచకప్ అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును రోహిత్​ శర్మ అందుకుంటాడని 8/13 నిష్పత్తిలో పందేలు జరుగుతున్నాయి. డేవిడ్ వార్నర్​ సాధిస్తాడని 11/8, రూట్​పై 20/1 నిష్పత్తిలో బెట్టింగ్​లు వేస్తున్నారు క్రీడాభిమానులు.

రోహిత్ శర్మ

ఇదీ చదవండి: WC19: కివీస్​తో పోరుకు భారత్​ ఇస్మార్ట్ ప్లాన్​

Last Updated : Jul 9, 2019, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details