తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ X కివీస్​​ మ్యాచ్​కు భారీ వర్షం ముప్పు - icc

ప్రపంచకప్​ టోర్నీకి వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే పలు మ్యాచ్​లు రద్దవగా... గురువారం జరగనున్న భారత్​-న్యూజిలాండ్​ మ్యాచ్​కూ వర్షం ముప్పు పొంచి ఉంది.

భారత్​Xన్యూజిలాండ్​ మ్యాచ్​కు భారీ వర్షం ముప్పు

By

Published : Jun 11, 2019, 3:43 PM IST

ఇంగ్లాండ్​లో జరుగుతున్న ప్రపంచకప్​ సంగ్రామానికి వర్షాలు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్​లు వర్షం దెబ్బకు రద్దయ్యాయి. ఆదివారం భారత్​-ఆసీస్​ మ్యాచ్​కు తృటిలో వరుణ ప్రమాదం తప్పినా... గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్​కు మాత్రం వాన పోరు తప్పేలా లేదు. నాటింగ్‌హామ్‌లో ఈ మ్యాచ్​ జరగనుంది. లంచ్‌ విరామ సమయం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఇదే జరిగితే ఓవర్లు తగ్గించి మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.

  • వాన కారణంగా జూన్​ 10 సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్, జూన్ 7న బ్రిస్టల్ వేదికగా శ్రీలంక - పాకిస్థాన్ మ్యాచ్​ రద్దయింది. మ్యాచ్ ఫలితం తేలని కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

ఎల్లో హెచ్చరిక..

రెండు రోజులుగా బ్రిటన్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. దాదాపుగా ఈ వారమంతా నాటింగ్‌హామ్‌ ప్రాంతంలో ఎల్లో హెచ్చరిక అమలులో ఉంది.

  • కివీస్​తో మ్యాచ్​ వేదికైన నాటింగ్​హామ్​లో బుధవారం రాత్రి 7 గంటల వరకు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్​ రోజు లంచ్‌ సమయం వరకు తేలికపాటి జల్లులు కురవవచ్చని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్‌గా... కనిష్ఠ ఉష్ణోగ్రత 10 నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఇవీ చూడండి...

ఈ వరల్డ్​కప్​లో రెండోసారి అడ్డుకున్న వరణుడు

ABOUT THE AUTHOR

...view details