దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పారామిలటరీకి చెందిన బలిదాన్ బ్యాడ్జ్ చిహ్నం ముద్రించి ఉన్న గ్లౌజ్స్‌తో ధోనీ కీపింగ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఐసీసీ.. బీసీసీఐ నుంచి వివరణ కోరింది. ఇప్పటికే ఐసీసీ నుంచి అనుమతి కోరామని అంటోందీ బీసీసీఐ.
ధోనీ గ్లౌజ్స్పై ఉంది సైన్యానికి సంబంధించిన చిహ్నం కాదని.. ఇందుకు సంబంధించి ఐసీసీ అనుమతి కూడా కోరామని చెప్పారు బీసీసీఐ పాలకమండలి చీఫ్ వినోద్ రాయ్.
"ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటలో వాణిజ్య, మత, రాజకీయాలకు సంబంధించిన లోగోలు వాడరాదు. బలిదాన్ చిహ్నం మతాలకు, వాణిజ్య అంశాలకు సంబంధించింది కాదు. ధోనీ నింబంధనలను అతిక్రమించలేదు".
-వినోద్ రాయ్, బీసీసీఐ పాలకమండలి సారథి
ధోనీ బలిదాన్ చిహ్నం ఉన్న గ్లౌజ్ ధరించి కీపింగ్ చేయడంపై నెటిజన్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. అవసరమైతే ప్రపంచకప్‌ను బహిష్కరిద్దాం కానీ.. ఆ గ్లౌజ్‌పై చిహ్నాన్ని తొలగించడానికి వీల్లేదంటూ క్రికెట్ అభిమానులు ధోనీని కోరుతున్నారు.
ఇవీ చూడండి.. ప్రపంచకప్‌లో కౌల్టర్‌నైల్ కొత్త రికార్డు