ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా వన్డేల్లో 8వేల పరుగుల వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 24 పరుగుల వద్ద వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 175 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకోగా, ఆమ్లా 176 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
కోహ్లీ రికార్డును కొద్దిలో మిస్సయిన ఆమ్లా - south africa batsmen hashim amla
బర్మింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా మరో రికార్డు సాధించాడు. ఈ ఆటలో అర్ధశతకంతో రాణించిన ఆమ్లా... భారత సారథి విరాట్ కోహ్లీ రికార్డును కొద్దిలో మిస్సయ్యాడు.
కొద్దిలో కోహ్లీ రికార్డు మిస్సయిన ఆమ్లా
సఫారీల్లో వేగంగా...
అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఆమ్లా. ఈ క్లబ్‌లో చేరిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగానూ పేరు లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో జాక్వెస్ కలిస్(11,579), డివిలియర్స్(9577), గిబ్స్(8094) పరుగులతో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.