తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: ప్రపంచకప్​ కెరీర్​కు గేల్ వీడ్కోలు

40 ఏళ్ల విండీస్​ విధ్వంసకర ఓపెనర్​ క్రిస్ గేల్​ గురువారం తన చివరి ప్రపంచకప్​ మ్యాచ్​ ఆడాడు. లీడ్స్​లో అఫ్గానిస్థాన్​​తో జరిగిన పోరులో 7 పరుగులకే నిష్క్రమించాడు.

ప్రపంచకప్​ చివరిమ్యాచ్​లోనూ నిరాశపరిచిన గేల్​

By

Published : Jul 5, 2019, 9:30 AM IST

Updated : Jul 5, 2019, 9:36 AM IST

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు, యూనివర్స్‌ బాస్ క్రిస్‌గేల్‌ గురువారం తన ఆఖరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడాడు. లీడ్స్‌ వేదికగా అఫ్గాన్​తో జరిగిన పోరులో గేల్​ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. వీడ్కోలు మ్యాచ్​లో 18 బంతులాడిన హిట్టర్​... 7 పరుగులు మాత్రమే సాధించాడు.

రెండు మిస్​...

  1. అఫ్గాన్​తో మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ 18 పరుగులు చేస్తే.. విండీస్‌ తరఫున దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్​ చేసేవాడు. లారా 295 మ్యాచ్‌ల్లో 10348 పరుగులు చేసి ముందంజలో ఉండగా గేల్‌ ప్రస్తుతం 295 మ్యాచ్‌ల్లో 10338 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
  2. ఇదే మ్యాచ్​లో 47 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ తరఫున లారా పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (1225)ను అధిగమించేవాడు.
  3. ప్రపంచకప్​ కెరీర్​ చివరి ఆటలో శతకం సాధిస్తే ఏకంగా వివియన్‌ రిచర్డ్స్‌ సరసన చోటుదక్కించుకొనేవాడు. కాని ఆ అవకాశాన్నీ కోల్పోయాడు. ప్రపంచకప్‌లో రిచర్డ్స్‌ మూడు శతకాలు సాధించగా గేల్‌ ప్రస్తుతం రెండు శతకాలతోనే గుడ్​బై చెప్పేశాడు.

1186 పరుగులు... 16 వికెట్లు

5 ప్రపంచకప్​లు ఆడిన గేల్​...1186 పరుగులు చేశాడు. 90.56 స్టయిక్​ రేట్​తో పరుగులు సాధించాడు. మెగాటోర్నీలో సగటు 35.93గా ఉంది. వన్డే ప్రపంచకప్​లో 49 సిక్స్​లు కొట్టిన గేల్​..2 శతకాలు సాధించాడు. వాటిలో 215 పరుగులు అత్యుత్తమం. బౌలింగ్​లోనూ రాణించిన క్రిస్​​...16 వికెట్లు తీశాడు.

ప్రపంచకప్​కు వీడ్కోలు పలికిన గేల్​.. టీ20ల్లో ఇకపై ఆడనని చెప్పేశాడు. కాని మెగాటోర్నీ తర్వాత భారత్​తో జరగనున్న వన్డే , టెస్ట్​ సిరీస్​లలో ఆడనున్నట్లు వెల్లడించాడు.

Last Updated : Jul 5, 2019, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details