తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ నిబంధనలపై గౌతమ్ గంభీర్ మండిపాటు - న్యూజిలాండ్

ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​ టైగా ముగిస్తే బౌండరీల సంఖ్యతో విజేతను నిర్దేశించే నియమం హాస్యాస్పదంగా ఉందన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. తన దృష్టిలో ఇరు జట్లూ విజేతలేనని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ నిబంధనలపై మండిపడ్డ గౌతమ్ గంభీర్

By

Published : Jul 15, 2019, 8:39 AM IST

ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్​ ఫైనల్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. సూపర్​ ఓవర్​లోనూ టైగా ముగిసిన ఈ మ్యాచ్​లో ఇంగ్లీష్ జట్టు కప్పు గెలుచుకుంది. నిబంధనలు రూపొందించిన ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. బౌండరీల సంఖ్యతో విజయాన్ని నిర్దేశించడం హాస్యాస్పదంగా ఉందని ట్వీట్ చేశాడు. తన దృష్టిలో ఇరు జట్లూ విజేతలేనన్నాడు.

ప్రపంచకప్​ గెలిచిన ఇంగ్లాండ్

సూపర్ ఓవర్​లో న్యూజిలాండ్​ గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు కావాలి. ఆ స్థితిలో కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్​లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.

ఇది చదవండి: 'సూపర్'​ థ్రిల్లర్​ మ్యాచ్​లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్​

ABOUT THE AUTHOR

...view details