తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​ బ్యాట్స్​మెన్​ గేమా? ఐసీసీకీ ప్రశ్నల వర్షం

లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. అయితే బౌండరీ కౌంట్​ ద్వారా ఇంగ్లీష్ జట్టును విన్నర్​గా ప్రకటించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. "ఇంగ్లాండ్​ను కివీస్ ఆలౌట్ చేసింది.. వికెట్లను లెక్కలోకి తీసుకోవాలి కదా" అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

By

Published : Jul 15, 2019, 1:35 PM IST

Updated : Jul 15, 2019, 2:39 PM IST

ఇంగ్లాండ్ - న్యూజిలాండ్

"క్రికెట్ బ్యాట్స్​మెన్ గేమ్.." అంటూ విమర్శలు వినిపిస్తుంటాయి. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్​ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. బ్యాటింగ్ చేయలేకో, బౌలింగ్​లో విఫలమయ్యో, ఫీల్డింగ్ లోపమో అయి ఓడితే అర్థముంది. కేవలం బౌండరీల ఆధారంగా విశ్వవిజేతను నిర్ణయించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో బౌండరీ కౌంట్​ ద్వారా విజేతను ప్రకటించారు.

"బౌండరీల అంతరమే కివీస్​కు ప్రపంచకప్ దూరం చేసింది" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు పోటెత్తుతున్నాయి. "వాళ్లు (ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్) బౌండరీలు ఎక్కువ కొట్టారు సరే.. న్యూజిలాండ్ ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది కదా" అంటూ కివీస్​కు అనుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. ఐసీసీ నిబంధనలపై ఘాటుగా స్పందిస్తున్నారు.

ఈ నిబంధనను మాజీలు సైతం తప్పుపడుతున్నారు. ఆసీస్​ మాజీ ఆటగాడు బ్రెట్​ లీ దీనిపై స్పందించాడు. "ఈ విధంగా విజేతను నిర్ణయించడం దారుణం" అంటూ ట్వీట్ చేశాడు.

వారిద్దరి బౌండరీలే కివీస్​కు కప్పు దూరం చేశాయా..?

ఇంగ్లాండ్​కు ప్రపంచకప్​ను అందించడంలో కీలకపాత్ర పోషించింది బెన్​ స్టోక్సే​. కానీ బౌండరీ కౌంట్ ద్వారా వరల్డ్​కప్​ అందించింది మాత్రం బెయిర్​స్టో, బట్లర్​లే. వీరిద్దరే 13 బౌండరీలు బాదారు. బెయిర్​ స్టో 55 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. బట్లర్ 60 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ కొట్టిన మొత్తం బౌండరీలు 26 ( 23 ఫోర్లు, 3 సిక్సర్లు) బౌండరీల్లో సగం (13) వీరిద్దరే కొట్టారు. ఈ బౌండరీల అంతరమే న్యూజిలాండ్​కు ప్రపంచకప్​ను దూరం చేసింది. కివీస్ ఖాతాలో 17 బౌండరీలే ఉన్నాయి.

బెయిర్ స్టో - బట్లర్

ఆలౌట్​ను లెక్కలోకి తీసుకోలేదు..

బౌండరీలకు బదులు వికెట్లను లెక్కలోకి తీసుకుని ఉంటే న్యూజిలాండ్​ విజేతగా నిలిచేదే. క్రికెట్ బ్యాట్స్​మెన్ గేమ్​ అనడానికి ఇదే నిదర్శనం. చివరి ఓవర్ వరకు అద్భుతంగా పోరాడిన కివీస్​ ఆఖరి ఓవర్లో రెండు రనౌట్లు చేసి ఇంగ్లీష్ జట్టును ఆలౌట్ చేసింది. ఈ రకంగా చూసుకుంటే న్యూజిలాండ్​కు అనుకూలించేదే .

కివీస్ జట్టు

హృదయ విజేత అని సరిపెట్టుకోవాలా..?

ఐసీసీ వివాదాస్పద నిబంధనల కారణంగా "న్యూజిలాండ్ పరాజిత కాదు.. హృదయ విజేత" అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెమీస్​లో టీమిండియాను ఓడించి భారత అభిమానుల ఆశలను ఆవిరి చేసింది కివీస్​. అయితే ఫైనల్లో తన పోరాట స్ఫూర్తితో టీమిండియా ఫ్యాన్స్​ను సైతం ఆకట్టుకుంది. కప్పు చేజారిందని తెలిసినా మొహంలో ఆ బాధ కనిపించకుండా హుందాగా ప్రవర్తించిన కేన్ విలియమ్సన్ చూసి మెచ్చుకుంటున్నారు అభిమానులు. అందరూ ఆమోదించదగ్గ నియమాలతో విజేతను నిర్ణయించాల్సిన అవసరం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు.

కేన్ విలియమ్సన్​

ఇది మొదటి సారి కాదు..

1999 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీస్​ మ్యాచ్ ఇదే విధంగా టై అయింది. అయితే లీగ్​ మ్యాచ్​ల్లో ప్రొటీస్​పై గెలిచిన ఆసీస్​ నెట్​ రన్​రేట్ ఆధారంగా ఫైనల్​కు వెళ్లింది. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం రేపింది.

ఇది చదవండి: ఐసీసీ నిబంధనలపై గౌతమ్ గంభీర్ మండిపాటు

Last Updated : Jul 15, 2019, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details