ఇంగ్లాండ్‌తో జరిగిన పోరులో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్ స్థానంలో పంత్‌కు అవకాశం దొరికింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే ఆడిన మొదటి మ్యాచ్‌లోనే రిషభ్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించడం మంచిది కాదని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
ఇంగ్లాండ్‌కు చావోరేవో మ్యాచ్.. అదీ టీమిండియాతో.. ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది మోర్గాన్ సేన. అనూహ్య ఓటములతో సెమీస్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. భారత్‌పై గెలిచి సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంచుకోవాలని భావించిన ఇంగ్లాండ్ జట్టు అదే రీతిలో ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్ స్థానంలో పంత్‌కు చోటు లభించింది. టీమిండియాకు ఎప్పటి నుంచో ఆందోళన కలిగిస్తోన్న నాలుగో స్థానంలో రిషభ్ బ్యాటింగ్‌కు దిగాడు. భారత్ గెలిస్తే ఎలా ఉండేదో కానీ.. కోహ్లీ సేన ఓటమి తర్వాత ఈ స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.
మ్యాచ్ అనంతరం పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై ఓ విలేకరి రోహిత్‌ను ప్రశ్నిస్తూ.. అంత కఠిన పరిస్థితుల్లో పాండ్యను కాదని పంత్‌కు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యకరంగా అనిపించ లేదా అని అడిగాడు. దీనిపై రోహిత్ స్పందిస్తూ..