తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సూపర్'​ థ్రిల్లర్​ మ్యాచ్​లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్​ - స్టోక్స్

లార్డ్స్ వేదికగా ఉత్కంఠగా జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో  న్యూజిలాండ్​పై ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించింది. ప్రపంచకప్​ చరిత్రలో తొలిసారిగా కప్పును అందుకుంది. అద్భుతంగా ఆడిన స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగజ్జేతగా ఇంగ్లాండ్​

By

Published : Jul 15, 2019, 1:28 AM IST

Updated : Jul 15, 2019, 2:31 AM IST

ప్రపంచకప్​ ఫైనల్ మ్యాచ్​ హైలెట్స్

ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాల మధ్య మొదలైన క్రికెట్ విశ్వసమరంలో హోరాహోరీగా తలపడ్డాయి కివీస్​- ఇంగ్లాండ్. ఇప్పటివరకూ వరల్డ్​కప్ ట్రోఫీని దక్కించుకోని ఇంగ్లాండ్, కివీస్​ నువ్వానేనా అన్నట్టు కొదమసింహాల్లా పోరాడాయి. అయితే చివరికి సూపర్​ ఓవర్​ సమరంతో ప్రపంచకప్ విజేతగా అవతరించింది ఇంగ్లాండ్. వారి దేశ క్రికెట్​కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తూ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది.

ప్రపంచకప్​ గెలిచిన ఆనందంలో ఇంగ్లాండ్

చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్​ మ్యాచ్​ టైగా ముగించింది. సూపర్ ఓవర్ కూడా టై అయింది. బౌండరీలు ఎక్కువ సాధించిన ఇంగ్లాండ్.. జగజ్జేతగా నిలిచింది.​

ప్రపంచకప్​ గెలిచిన ఆనందంలో ఇంగ్లాండ్

లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్​. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ 55 అత్యధిక పరుగులు చేశాడు. లేథమ్ 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో గప్తిల్ 11, విలియమ్సన్ 30, టేలర్ 15, నీషమ్ 19, గ్రాండ్​హోమ్ 16 పరుగులు చేశారు.

న్యూజిలాండ్ జట్టు

ఇంగ్లాండ్ బౌలర్లలో​ వోక్స్, ప్లంకెట్ తలో 3 వికెట్లు తీశారు. ఆర్చర్, వుడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ రాయ్ (17) తొందరగానే ఔటయ్యాడు. కాసేపటికే రూట్ (7), బెయిర్​ స్టో (36) వెనుదిరిగారు. కెప్టెన్ మోర్గాన్ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఫలితంగా 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లాండ్.

బట్లర్- స్టోక్స్ శతక భాగస్వామ్యం

అనంతరం స్టోక్స్-బట్లర్ జోడీ సమయోచితంగా ఆడుతూ పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. స్టోక్స్ నెమ్మదిగా ఆడగా.. బట్లర్ తనదైన శైలిలో చెలరేగాడు. ఈ క్రమంలోనే ఇరువురు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు.అనంతరం 59 పరుగులు చేసిన బట్లర్ ఫెర్గుసన్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ఫలితంగా ఐదో వికెట్​కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

స్టోక్స్-బట్లర్ జోడీ

ఓ ఎండ్​లో స్టోక్స్ నిలబడినా ఇతర బ్యాట్స్​మెన్ వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగారు. వోక్స్ 2, ప్లంకెట్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. రషీద్, వుడ్​ పరుగులేమి చేయకుండానే రనౌట్ అయ్యారు. ఆర్చర్​ నీషమ్​ బౌలింగ్​లో బౌల్డ్​ అయ్యాడు.

చివరి ఓవర్​లో 15 పరుగుల కావాలి. ఆ స్థితిలో అద్భుతంగా ఆడిన స్టోక్స్ 84 పరుగులతో నాటౌట్​గా నిలిచి మ్యాచ్​ను టైగా ముగించాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా బెన్ స్టోక్స్

కివీస్ బౌలర్లలో నీషమ్, ఫెర్గుసన్ తలో 3 వికెట్లు తీశారు. గ్రాండ్​హోమ్, హెన్రీ తలో వికెట్ దక్కించుకున్నారు.

సూపర్ ఓవర్​ ఇంగ్లాండ్​దే..

సూపర్ ఓవర్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. వికెట్లేమి కోల్పోకుండా 15 పరుగులు చేసింది. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్.. వికెట్ కోల్పోయి సరిగ్గా అన్ని పరుగులే చేసింది. కేవలం ఒక సిక్స్ మాత్రమే కొట్టింది.

సూపర్ ఓవర్​లో ఇంగ్లాండ్​ను విజేతగా చేసిన రనౌట్

బౌండరీలు ఎక్కువ కొట్టిన ఇంగ్లాండ్ ప్రపంచకప్​ విజేతగా నిలిచింది.

ఇది చదవండి: WC19: మ్యాట్ హెన్రీ రికార్డ్

Last Updated : Jul 15, 2019, 2:31 AM IST

ABOUT THE AUTHOR

...view details