ఇంగ్లాండ్ ఈ మెగాటోర్నీ ముందు వరకు ఒక్క ప్రపంచకప్‌ను అందుకోలేదని అనుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఇంగ్లాండ్ ఆరు సార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అందులో 3 సార్లు లార్డ్స్‌లోనే కప్‌ను అందుకుంది. అదేంటి ఇంగ్లీష్ జట్టు 6 వరల్డ్‌కప్‌లు ఎప్పుడు గెలిచింది అనుకుంటున్నారా! ఇంగ్లాండ్ మహిళల జట్టు సాధించిన 4 వరల్డ్‌కప్‌లు.. 2010లో పురుషుల జట్టు నెగ్గిన టీ 20 ప్రపంచకప్‌ను కలుపుకుని మొత్తం ఆరింటిని సొంతం చేసుకుంది ఇంగ్లాండ్.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఏడాది మెగాటోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు విజయం సాధించగా.. 1993, 2017 మహిళల జట్టు వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచింది.
2017 మహిళల వరల్డ్‌కప్ విజేత..
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లీష్ అమ్మాయిలు నాలుగోసారి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 228 పరుగులు చేయగా.. అనంతరం టీమిండియా అమ్మాయిలు 219 పరుగులకు ఆలౌటయ్యారు.