చెస్టర్లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు బెయిర్‌స్టో 106, రాయ్ 60 మెరుపులతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించారు.
కివీస్ బౌలింగ్ భళా.. లక్ష్యం 306 - ఇంగ్లాండ్
నిర్ణయాత్మక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. కివీస్‌కు 306 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెయిర్ స్టో సెంచరీ చేశాడు. కివీస్ బౌలర్లు బౌల్ట్, నీషమ్, హెన్రీ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
కివీస్ బౌలింగ్ భళా.. లక్ష్యం 306
కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. కెప్టెన్ మోర్గాన్ 42 పరుగులు మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.
అద్భుతంగా ప్రదర్శన చేసిన కివీస్ బౌలర్లు.. ఆరంభంలో ధారాళంగా పరుగులిచ్చినా చివర్లో పరుగులు చేయకుండా కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్ధి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. బౌల్ట్, హెన్రీ, నీషమ్ తలో రెండు వికెట్లు తీశారు. శాంట్నర్, సౌతీ చెరో వికెట్ దక్కించుకున్నారు.