టీమిండియా ప్రపంచకప్ సాధించాలని ధోనీ తల్లి దేవకీ ఆకాంక్షిస్తున్నారు. అందుకోసం రాంచీలోని దివ్డీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆమె.
ధోనీ తల్లి పూజల సెంటిమెంట్ పనిచేస్తుందా?
ఐసీసీ ప్రపంచకప్ 2019 టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు ట్రోఫీ గెలవాలని పూజలు చేశారు ధోనీ తల్లి దేవకీ దేవి. 20 నిమిషాల పాటు రాంచీలోని దివ్డీ ఆలయంలో అర్చనలు నిర్వహించారు.
ప్రపంచకప్ గెలవాలని ధోనీ మాతృమూర్తి పూజలు
2011లో ప్రపంచకప్ గెలవాలని ఈ ఆలయంలోనే ప్రార్థనలు చేశారు కుటుంబ సభ్యులు, రాంచీ వాసులు. ఆ ఏడాది మెగాటోర్నీ కప్పు గెలిచి ధోనీ ఇంటికి రావడం వల్ల ఈసారీ అదే నమ్మకంతో ఉన్నారు.
ఇవీ చూడండి: