తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్ అవ్వట్లేదు.. కానీ విండీస్ పర్యటనకు దూరం - panth

వెస్టిండీస్ పర్యటనకు ధోని దూరం కానున్నాడు. ఈ విషయాన్ని అతడే తెలిపాడని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతానికి ధోని క్రికెట్​కు రిటైర్మెంట్ పలకట్లేదని చెప్పారు.

మహేంద్ర సింగ్ ధోని

By

Published : Jul 20, 2019, 1:26 PM IST

Updated : Jul 20, 2019, 2:13 PM IST

వెస్టిండీస్​ పర్యటనలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉంటాడా లేదా అనే ఊహాగానాలకు తెరపడింది. మహీ అందుబాటులో ఉండట్లేదని, ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు.

"విండీస్ పర్యటనకు ధోని అందుబాటులో ఉండడు. లెఫ్టినెంట్ కల్నల్​గా ఉన్న మహీ వచ్చే రెండు నెలలు తన పారామిలిటరీ రెజిమెంట్​తో గడపనున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీ, సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ ఎమ్​ఎస్​కే ప్రసాద్​కు తెలియజేశాం" -బీసీసీఐ ప్రతినిధి.

ప్రస్తుతానికి ధోని రిటైర్మెంట్​ తీసుకోవట్లేదని... ఇది మాత్రం స్పష్టమని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఆదివారం ప్రకటించనుంది సెలక్షన్ కమిటీ. మహీ స్థానంలో వికెట్​ కీపర్​గా రిషభ్ పంత్​కు చోటు దక్కే అవకాశముంది.

ఇది చదవండి: 'అప్పటి వరకు కెప్టెన్​గానా..? పెద్ద బాధ్యతే'

Last Updated : Jul 20, 2019, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details