తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: ఇంగ్లాండ్​లోనే బీసీసీఐ పర్యవేక్షణలో ధావన్

ఇంగ్లాండ్​లోనే బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ధావన్ విశ్రాంతి తీసుకోనున్నట్టు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. కనీసం మూడు మ్యాచ్​లకు శిఖర్ దూరమయ్యే అవకాశముందని చెప్పారు.

By

Published : Jun 11, 2019, 10:50 PM IST

Updated : Jun 12, 2019, 12:48 AM IST

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ ప్రపంచకప్​లో కనీసం 3​ మ్యాచ్​లకు దూరం కానున్నట్టు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు . ఇంగ్లాండ్​లోనే ఉండి బీసీసీఐ పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నట్టు చెప్పారు. ఆసీస్​తో మ్యాచ్​లో ధావన్ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. ఫలితంగా.. 3 వారాల పాటు మ్యాచ్​లకు దూరం కానున్నాడు.

"భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. గాయం నుంచి కోలుకునేంత వరకు ఇంగ్లాండ్​లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోనున్నాడు. ఎడమ చేతి బొటన వేలుకు, చూపుడు వేలుకు మధ్య గాయమైంది. ధావన్ స్థానంలో ఆడేది ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతడు 3 మ్యాచ్​లకు దూరమయ్యే అవకాశముంది. అనుకున్న సమయం కంటే శిఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం" -బీసీసీఐ ప్రతినిధి

ధావన్ స్థానంలో ఎవరు ఆడతారు అనే దానిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వనప్పటికీ క్రీడా సమాజం నుంచి రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రిషభ్ పంత్, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి.

Last Updated : Jun 12, 2019, 12:48 AM IST

ABOUT THE AUTHOR

...view details