తెలంగాణ

telangana

ETV Bharat / sports

డివిలియర్స్​ వస్తానన్నా.. వద్దన్నారు

ప్రపంచకప్ దక్షిణాఫ్రికా జట్టులోకి రావాలని డివిలియర్స్ అనుకున్నాడట. కానీ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ సెలక్షన్ కమిటీ తిరస్కరించిందని సమాచారం.

డివిలియర్స్​

By

Published : Jun 6, 2019, 7:44 PM IST

వరుస పరాజయాలతో డీలా పడిన దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్​ లోటు స్పష్టంగా కనపడుతోంది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ఈ ఆటగాడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావించాడట. ప్రపంచకప్​లో పునరాగమనం చేయాలని అనుకున్న డివిలియర్స్​ నిర్ణయాన్ని ప్రొటీస్ క్రికెట్ బోర్డు తిరస్కరించిందని సమాచారం.

ఏప్రిల్​లో దక్షిణాఫ్రికా ప్రపంచకప్​ జట్టును ప్రకటించింది. ఇందుకు 24 గంటల ముందే జట్టులోకి రావాలనే తన నిర్ణయాన్ని బోర్డు ముందు వ్యక్తపరిచాడట డివిలియర్స్. సఫారీ జట్టు సారథి డుప్లెసిస్, కోచ్ ఓటిస్ గిబ్సన్ కూడా ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారట. అయినా బోర్డు ఈ నిర్ణయాన్ని తిరస్కరించిందని తెలుస్తోంది.

"ప్రపంచకప్​లోకి రావాలన్న నిర్ణయాన్ని డివిలియర్స్ ప్రతిపాదించాడు. కానీ సిద్ధాంతాలకు లోబడే అతని నిర్ణయాన్ని తిరస్కరించాం. 2018లో రిటైర్​మెంట్ తీసుకోవద్దని అతడిని కోరా. కానీ ఆ విషయాన్ని ఏబీ పట్టించుకోలేదు. కెప్టెన్ డుప్లెసిస్, కోచ్ ఓటిస్ గిబ్సన్ కూడా డివిలియర్స్​ నిర్ణయాన్ని మాతో పంచుకున్నారు. కానీ రిటైర్​ అయినపుడే అతడికి అన్ని దారులు మూసుకుపోయాయి".
-లిండా జోండి, దక్షిణాఫ్రికా క్రికెట్ సెలక్షన్ కమిటీ కన్వీనర్

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details