తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19:​ ఫైనల్​కు ముగ్గురు చిన్నారి అతిథులు!

ప్రపంచకప్​ టోర్నీని దేశ వ్యాప్తంగా ఓ వేడుకలా నిర్వహించింది ఇంగ్లాండ్. చిన్నారులను ఆటలవైపు ఆకర్షించేలా 'ఆల్ స్టార్స్ క్రికెట్' పేరుతో ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. పోటీలు నిర్వహించి గెలిచిన వారికి ప్రపంచకప్ మోసే అవకాశం ఇచ్చింది. ముగ్గురు లక్కీ విన్నర్స్​కు లార్డ్స్​లో ప్రత్యేక అతిథులుగా స్థానం కల్పించింది.

ప్రపంచకప్​ ఫైనల్​: ముగ్గురు చిన్నారి అతిథులు...?

By

Published : Jul 14, 2019, 2:00 PM IST

ఐసీసీ నిర్వహించిన 45 రోజుల క్రికెట్​ విశ్వ సమరం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. నేటితో ముగియనున్న ఈ వేడుకకు లార్డ్స్​ వేదికైంది. ఇంగ్లాండ్​​, వేల్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీని దేశవ్యాప్తంగా ఓ పండుగలా నిర్వహించింది అక్కడి ప్రభుత్వం. ముఖ్యంగా పిల్లలను క్రికెట్​ వైపు ఆకర్షించేందుకు వినూత్న కార్యక్రమాలు మొదలుపెట్టింది. 'ఆల్ స్టార్స్​ క్రికెట్'​ పేరుతో చిన్నారులకు పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తూ ప్రోత్సహించింది. ముగ్గురు లక్కీ విన్నర్లకు గోల్డెన్ టిక్కెట్లు ఇచ్చి ప్రపంచకప్ ఫైనల్​ చూసే అవకాశం కల్పించారు ప్రపంచకప్​ నిర్వాహకులు.

'ఆల్ స్టార్స్ క్రికెట్' మస్కట్​

చిట్టి చేతుల్లో ప్రపంచకప్​...

మార్చి 1నుంచి మార్చి 31 వరకు ఈ కార్యక్రమంలో రిజిస్టర్​ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. దాదాపు 50వేల మందికి పైగా చిన్నారులు భాగస్వాములయ్యారు. 4 నుంచి 9 ఏళ్ల లోపు ఉన్న పిల్లలే ఇందులో క్రీడాకారులు.

పిల్లలకు విరాట్​ పాఠాలు

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రికెట్​కు సంబంధించిన పోటీలు, క్విజ్​లు నిర్వహించి విజేతలను ప్రకటించారు. జూన్ 1న జరిగిన న్యూజిలాండ్ - శ్రీలంక, అఫ్గాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్​ల్లో సహా జూన్​ 2న దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్ మ్యాచ్​​కు ముందు ప్రపంచకప్​ను ఆ చిట్టి చేతులతో మోసే అవకాశం కల్పించారు. ఆట ఆరంభానికి ముందు వాళ్లే ఆ కప్​ను ఎత్తుకొని తీసుకెళ్లి ప్రత్యేక ప్రాంతంలో పెట్టారు.

ముగ్గురు గోల్డెన్​ అతిథులు వీరే...

ఈ కాంటెస్ట్​లో ముగ్గురు విజేతలకు గోల్డెన్​ టికెట్లు లభించాయి. 'సిద్ మెకాన్​సోవ్నీయా' అనే ఏడేళ్ల పిల్లాడు మొదటి గోల్డెన్ టికెట్​ను సొంతం చేసుకున్నాడు. 'లూయిస్'​ అనే ఐదేళ్ల పాప రెండో టిక్కెట్​ గెల్చుకుంది. 'ఎలిజా థామస్' అనే చిన్నారి మూడో గోల్డెన్ టిక్కెట్ అందుకుంది. ఈ ముగ్గురు నేటి ఫైనల్ మ్యాచ్​కు హాజరు కానున్నారు.

ముగ్గురు అతిథులు: సిద్​, లూయిస్​, ఎలిజా
ఆటల్లో చిన్నారు
లు

ABOUT THE AUTHOR

...view details