తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్, కోచ్​తో బీసీసీఐ సమీక్ష.. ప్రదర్శనపై ఆరా! - రివ్యూ

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో సమీక్ష నిర్వహించనుంది బీసీసీఐ పాలక మండలి. ఇందులో సీఓఏ.. జట్టు బృందానికి మూడు ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం. త్వరలో ఈ భేటీ జరగనుంది.

బీసీసీఐ సీఓఏ

By

Published : Jul 12, 2019, 2:59 PM IST

ప్రపంచకప్​లో భారత్​ ప్రదర్శనపై బీసీసీఐ పాలక మండలి(సీఓఏ) సమీక్ష నిర్వహించనుంది. ఈ భేటీలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహా టీమ్ మేనేజ్​మెంట్​కు ప్రశ్నలు సంధించనుంది. మెగాటోర్నీలో భారత్​ ప్రదర్శన, తుది జట్టులో ఆటగాళ్ల ఎంపికపై చర్చించనుంది. ఈ సమావేశం ఎప్పుడు జరగనుందో త్వరలో తెలియపరుస్తామని సీఓఏ సారథి వినోద్ రాయ్ తెలిపారు.

"మెగాటోర్నీలో టీమిండియా ప్రదర్శనపై కోచ్, కెప్టెన్​లతో ఓ సమీక్ష నిర్వహిస్తాం. ఇది ఎప్పుడు జరుగుతుందో త్వరలో తెలియజేస్తాం. సెలక్షన్ కమిటీతోనూ దీనిపై చర్చిస్తాం" - సీఓఏ చీఫ్ వినోద్ రాయ్

ముఖ్యంగా ఈ సమీక్షలో జట్టు బృందానికి.. సీఓఏ మూడు ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం.

  1. అంబటి రాయుడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు..?
  2. ముగ్గురు వికెట్​ కీపర్లకు సెమీఫైనల్​ జట్టులో చోటు ఎందుకు లభించింది.?
  3. సెమీస్​లో ధోనీని 7వ స్థానంలో ఎందుకు పంపారు..?

న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్ మ్యాచ్​లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయి అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. ధోనీని 7వ స్థానంలో పంపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముందే వచ్చుంటే టీమిండియా గెలిచేదే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గాయం కారణంగా జట్టుకు దూరమైన విజయ్​శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్​కు స్థానం కల్పించారు. స్టాండ్​ బై ఆటగాడిగా ఉన్న రాయుడును పక్కన పెట్టారు. ఇందుకు మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంటు ప్రకటించాడు.

ఇది చదవండి: కోహ్లీసేన ప్రపంచకప్​ ప్రైజ్​మనీ ఇదే..

ABOUT THE AUTHOR

...view details