తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​కు విరాట్​ కోహ్లీ... పాకిస్థాన్​కు బాబర్ అజాం' - virat

పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్​మన్ బాబర్ అజాం ఆ జట్టుకు విరాట్ కోహ్లీ లాంటివాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్​ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్​లో పాక్​కు కీలకమౌతాడని కితాబిచ్చాడు.

క్లార్క్

By

Published : May 27, 2019, 2:06 PM IST

పాక్​ క్రికెటర్ బాబర్ అజాంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పొగడ్తల వర్షం కురిపించాడు. అతడు పాకిస్థాన్ కోహ్లీ అంటూ కితాబిచ్చాడు. ప్రపంచకప్​లో బాబర్ అజాం పాక్​కు కీలకమౌతాడని తెలిపాడు. అతడి బ్యాటింగ్ శైలి విరాట్​ను పోలి ఉంటుందని చెప్పాడు.

"బాబర్ అజాం మంచి క్లాసిక్ ప్లేయర్. పాక్ బ్యాటింగ్​ లైనప్​లో అతడు విరాట్​ కోహ్లీ. వరల్డ్​కప్​లో పాక్ సత్తాచాటాలనుకుంటే బాబర్​పైనే ఆధారపడాల్సి ఉంది" -మైఖేల్ క్లార్క్​, ఆసీస్​ మాజీ సారథి.

ఆఫ్గాన్​తో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో బాబర్ అజాం శతకంతో సత్తాచాటాడు. 108 బంతుల్లో 112 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాట్స్​మెన్ విఫలమైన కారణంగా పాక్ 262 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఆఫ్గాన్ బ్యాట్స్​మెన్ షాహిది(74), హజ్రతుల్లా(49) రాణించి మ్యాచ్​ను గెలిపించారు.

టీ 20ల్లో 26 ఇన్నింగ్స్​ల్లోనే అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజాం రికార్డు సృష్టించాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లోనూ ఆకట్టుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details