తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: గేల్ కవ్వింపు- రూట్ చిరునవ్వు - world cup

ఇంగ్లాండ్, విండీస్​ మధ్య జరిగిన మ్యాచ్​లో క్రిస్​ గేల్ డ్యాన్స్​ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రూట్​ను తన కవ్వింపు చర్యలతో అలరించాడీ కరీబియన్ క్రికెటర్.

గేల్

By

Published : Jun 15, 2019, 8:18 AM IST

Updated : Jun 15, 2019, 9:31 AM IST

వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో క్రిస్​ గేల్ తన డ్యాన్స్​తో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్ 21వ ఓవర్ బౌలింగ్​ సమయంలో ఈ ఘటన జరిగింది. బౌలింగ్​కు సిద్ధమవుతున్న తరుణంలో డ్యాన్స్​ చేశాడీ కరీబియన్ క్రికెటర్. స్టేడియంలోని అభిమానులు కేరింతలతో మద్దతుగా నిలిచారు.

గేల్ డ్యాన్స్

రూట్​తో సరదాగా
21 ఓవర్ గేల్ బౌలింగ్​లో రూట్ బంతిని స్వీప్ ఆడాడు. అది నేరుగా ఫీల్డర్​ చేతుల్లోకి వెళ్లింది. గేల్ రూట్​ వైపు తీక్షణంగా చూస్తు కవ్వించాడు. రూట్ కూడా చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రూట్ అజేయ శతకంతో చెలరేగాడు.

ఇవీ చూడండి.. విధ్వంసక క్రికెటర్ గేల్ సరికొత్త రికార్డు

Last Updated : Jun 15, 2019, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details