తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ-20 ప్రదర్శనతో రాయుడిని వన్డేలకు తీసుకోలేం' - WORLD CUP 2019

కొన్ని పరిస్థితుల కారణంగానే రాయుడును ప్రపంచకప్​న​కు ఎంపిక చేయలేకపోయామని చెప్పాడు చీఫ్ సెలక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్. అతడి  భావోద్వేగాల్ని అర్థం చేసుకున్నామని అన్నారు.

రాయుడు విషయంపై స్పందించిన ఎమ్మెస్కే ప్రసాద్

By

Published : Jul 21, 2019, 4:30 PM IST

వచ్చే నెలలో వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అందుకోసం జట్టును ఆదివారం ప్రకటించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రపంచకప్​లో అంబటి రాయుడు ఎంపిక అంశంపై స్పందించాడు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. ఏ ఒక్కరి విషయంలోనూ ద్వేషం, పక్షపాతం కానీ.. తమకు లేదని చెప్పాడు ఎమ్మెస్కే.

చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

"టీ20 ప్రదర్శనల ఆధారంగా అంబటి రాయుడును వన్డేలకు ఎంపిక చేయలేం. అలా చేస్తే విమర్శలు వస్తాయి. అతడిపై మాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. రాయుడు ఫిట్​నెస్ పరీక్షలో విఫలమైనప్పుడు, సంబంధిత శిబిరానికి పంపించాం. కొన్ని పరిస్థితుల వల్ల ప్రపంచకప్​ జట్టులోకి తీసుకోలేకపోయాం. అది సెలక్షన్ కమిటీ తప్పు కాదు. రాయుడు భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం. మెగాటోర్నీ కోసం ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా చేశాం. మాకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఏ ఒక్కరి విషయంలోనూ ద్వేషం, పక్షపాతం మాకు లేదు."

-ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్

ఇది చదవండి: వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

ABOUT THE AUTHOR

...view details